కేంద్ర పథకాలపై కలెక్టరేట్ లో సమీక్ష

- Advertisement -

కేంద్ర పథకాలపై కలెక్టరేట్ లో సమీక్ష

Review of Central Schemes in Collectorate

విశాఖపట్నం
యువ‌త ఉపాధికి, ప్ర‌జా సంక్షేమానికి పెద్ద‌పీట వేస్తూ… విశాఖ‌జిల్లా అభివృద్దికి ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు  కృషి చేయాల‌ని విశాఖ ఎంపీ శ్రీ‌భ‌ర‌త్ కోరారు.కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల గురించి వాటి ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని, విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని కోరారు.ప‌థ‌కాల అమ‌ల కొర‌కు కేంద్రం నుంచి వ‌స్తున్న నిధుల‌ను స‌మృద్ధిగా వినియోగించాల‌ని, ల‌బ్ధిదారుల‌కు పూర్తి స్థాయిలో ఫ‌లాలు అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. రాష్ట్ర ప‌రిధిలో అమ‌ల‌వుతున్న కేంద్ర‌ ప్రాయోజిత ప‌థ‌కాల తీరుతెన్నులు, స‌మ‌స్య‌లు, ఎదుర‌వుతున్న సవాళ్లు, అధికారుల స‌మ‌న్వ‌యం త‌దిత‌ర అంశాల‌పై జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సంద‌ర్భంగా ఎంపీ మాట్లాడుతూ అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి కేంద్రం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల ఫ‌లాలు అర్హులైన ప్ర‌జ‌లంద‌రికీ అందేలా కృషి చేయాల‌న్నారు. విద్యా రంగానికి పెద్ద‌పీట వేయాల‌ని, యువ‌త‌కు ఉపాధి క‌ల్ప‌న‌లో భాగంగా నైపుణ్య శిక్ష‌ణ అందించాల‌ని సూచించారు. ప్ర‌ధాన మంత్రి సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కంపై విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించి వీలైనంత ఎక్కువ మంది క‌నెక్ష‌న్లు పొందేలా సంబంధిత అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular