- Advertisement -
శ్రీకాళహస్తీశ్వరాలయం కు రూ.1.15లక్షల వెండి గిన్నెల వితరణ
Distribution of silver bowls worth Rs.1.15 lakhs to Srikalahasteeshwaralayamధి శ్రీకాళహస్తి సెప్టెంబర్ 13
శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాల సందర్భంగా ఉత్సవాలకు వాడుకునేందుకు రూ.1.15లక్షల విలువ చేసే వెండి గిన్నెలను శ్రీకాళహస్తికి చెందిన మదన్మోహన్ నాయుడు అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం విరాళంగా అందజేశారు. ఆలయ అధికారులు, వేదపండితులు ఈ విరాళం స్వీకరించారు. దాతకు కృతజ్ఞతలు తెలియచేసి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అదేవిధంగా స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
- Advertisement -




