పెంటపాడు రూరల్ మండలంలో ఆరున్నర కోట్లతో అభివృద్ధి-ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
Development in Pentapadu Rural Mandal six&half crores- MLA Bolishetti Srinivasతాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 13
తాడేపల్లిగూడెం నియోజకవర్గం లోని పెంటపాడు తాడేపల్లిగూడెం రూరల్ మండలాల్లో 6:30 కోట్లతో గ్రామాల్లోని రోడ్ల నిర్మాణానికి అనుమతులు వచ్చాయని తాడేపల్లిగూడెం శ్రీనివాస్ పేర్కొన్నారు. పెంటపాడు మండలంలోని కే పెంటపాడు, ఉమామహేశ్వరం, యానాలపల్లి గ్రామాల్లో వివిధ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి సాయి శక్తుల కృషి చేస్తానన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి గ్రామ పంచాయతీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలతో సంబంధం లేకుండా ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామన్నారు. నిధులు నేను తీసుకు వస్తాను నాకు సహకారం ఇవ్వండి అంటూ కూటమి నాయకులతో పాటు ప్రతిపక్ష నాయకులను ఆయన కోరారు. ఎవరు అడ్డు వచ్చినా అభివృద్ధిని మాత్రం ఆపలేరని పంచాయతీల అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళుతున్నాం అన్నారు. ఒకవైపు అభివృద్ధి పనులు చేస్తూనే 2014 నుండి 2019 వరకు గృహ నిర్మాణాలకు ఇచ్చిన హామీ ప్రకారం నిధులను ఖాతాదారులకు అందించేందుకు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగికరించారని అప్పట్లో ఎకౌంట్లో ఒక రూపాయి జమ అయిన వారందరికీ అతి త్వరలోనే తాడేపల్లిగూడెం నియోజకవర్గం లో మూడున్నర కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరను ఉంది అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ ఈతకోట తాతాజీ, పెంటపాడు మండల జనసేన పట్టణ, మండల అధ్యక్షులు పుల్లా బాబి, వర్తనపల్లి కాశి, తెలుగుదేశం నాయకులు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, పాలూరి వెంకటేశ్వరరావు, తోట రాజ, కాళ్ళ గోపికృష్ణ, మద్దాల మణికుమార్, కొనకల్ల హరినాథ్, దాసర హైమావతి, దత్తు ప్రసాద్ మరియు ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




