- Advertisement -
సింహాచలంలో వైభవంగా పవిత్రోత్సవాలు
Magnificent celebrations at Simhachalamసింహాచలం
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలోఅత్యంత వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి సింగాల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో స్థానాచార్యులు డాక్టర్ టీపి రాజగోపాల్, ప్రధానార్చకులు శ్రీనివాస్ ఆచార్యులు వైదిక సిబ్బంది వేద పండితులు నాదస్వర వేద మంత్రాలు నడుమ శుక్రవారం రాత్రి 7 గంటలకు పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో పవిత్రోత్సవాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఆలయంలో సెప్టెంబర్ 13 నుంచి 16 వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. సెప్టెంబర్ 13 న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి సింగల శ్రీనివాసమూర్తి దంపతులు తదితరులు పూజల్లో పాల్గొన్నారు.
- Advertisement -




