- Advertisement -
రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఘనంగా నిర్వహించిన హిందీ దినోత్సవం
Hindi Day was celebrated in Royal English Medium Schoolనంద్యాల
హిందీ దినోత్సవం సందర్భంగా రాయల్ పబ్లిక్ స్కూల్లో హిందీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పండెంట్ ఇసాక్ వలి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ అయినటువంటి యాకూబ్, హిందీ ప్రచార సమితి అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్ పీర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ఇస్మాయిల్ పీర్ మాట్లాడుతూ హిందీ యొక్క ప్రాముఖ్యత గురించి హిందీ నేర్చుకోవడం వల్ల మనకు ఎన్నో రకాల జీవనోపాధి కలుగుతుందని, ఇతర భాషలు తెలియక పోయినా హిందీ భాష తెలిసిన పౌరుడు మన దేశం లో ఎ ప్రాంతం అయిన వెళ్లి తిరిగి రాగలడు అని హిందీ ప్రాముఖ్యత గురించి వివరించారు. పాఠశాల డైరెక్టర్ అయినటువంటి యాకూబ్ హిందీ జాతీయ భాష గొప్పతనం గురించి వివరించడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథు రూపంలో విచ్చేసినటువంటి సయ్యద్ ఇస్మాయిల్ పీర్ కి సన్మానించారు. అనంతరం హిందీ టాలెంట్ టెస్ట్ లో విజేతలుగా నిలిచినటువంటి విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాలలోని హిందీ ఉపాధ్యాయుడు అయినటువంటి హుస్సేన్ భాష మరియు చాందిని, రిజ్వాన, సుమతి పాల్గొన్నారు.
- Advertisement -




