మెరుగైన వైద్య సేవలు అందించకపోతే చర్యలు తప్పవు
If better medical services are not provided, action will be takenకలెక్టర్ నాగరాణి
తాడేపల్లిగూడెం,
రోగులకు మెరుగైన వసతులు, సేవలు అందించకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు.తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిని శనివారం ఆమె సందర్శించారు.ఈ సందర్భంగా రోగులకు అందుతున్న సేవలు గురించి ఆరా తీశారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రోగులపట్ల వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం చేయవద్దు అన్నారు. ఈ సందర్భంగా ఏరియస్ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు పట్ల పలువురు రోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు . వైద్యులు సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశాలు ఇచ్చారు. మరోసారి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏరియా ఆస్పత్రిలో విద్యుత్ సమస్య, వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం వంటి అంశాలపై వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని ఏరియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తో మరోసారి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ సూర్యనారాయణ, వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.




