బిజేపి తీరు అప్రజాస్వామికం
BJP's style is undemocraticరాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు హేయమైన చర్య
డిసిసి అధ్యక్షులు దుర్గా ప్రసాద్
కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం
ఖమ్మం
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అగ్రనేత పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ పై బిజెపి అనుసరిస్తున్న తీరు అప్రజాస్వామికం అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా బిజెపి శివసేన నాయకులు చేస్తున్న ప్రకటనలు హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం పాత బస్ స్టాండ్ సర్కిల్ నందు బి జె పి నాయకుల దిష్టి బొమ్మ ను దహనం చేయడం జరిగిందని అన్నారు. ఒక ప్రజాస్వామిక వాదిగా ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ పై బిజెపి బెదిరింపులకు పాల్పడుతుందని అని అన్నారు. శివ సేన ఎంపి ఒకరు రాహుల్ గాంధీ నాలుక కోస్తే 11లక్షల రూపాయలు బహుమానం ఇస్తానని ప్రకటించగా బిజెపికి చెందిన మాజీ ఎమ్మెల్యే తన్విధర్ సింగ్ రాహుల్ గాంధీ నువు బయటికి వస్తె చంపేస్తామని మీ నానమ్మ ఇందిర గాంధీ కి పట్టిన గతే నీకు పడుతుందని బహిరంగంగా ప్రకటించారని అన్నారు. ఇంత బహిర్గత వ్యాఖ్యలు చేసినా ప్రధాని మోడీ కానీ హోం శాఖ మంత్రి అమిత్ షా గాని ఈ విషయంలో కనీసం స్పందించకపోవడం బిజెపి హింసా రాజాకీయల గుట్టు రట్టు అయిందని విమర్శించారు. బిజేపి తీరు మారక పోతే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు రాహుల్ గాంధీ కి అండగా ఉండి బిజెపి అహింసా, అప్రజాస్వామిక విధానాలపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. మోడీకి, అమిత్ షా కు రాజ్యాంగంపై చిత్తశుద్ధి ఉంటే వ్యవస్థలను సజావుగా నడపాలని రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలను చేసిన నాయకులపై చర్యలు తీసుకొని పార్టీ నుండి బహిస్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు అనంతరం మాజి ఎం ల్ సి ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ బి జె పి కి చెందిన కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు రాహుల్ గాంధీ అతిపెద్ద టెర్రరిస్టు అని అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రజాస్వామ్య వాదిగా ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాహూల్ గాంధీ వెనుకాడరని అన్నారు.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా మహిళా, మైనారిటీ,సేవాదళ్ అద్యక్షులు దొబ్బల సౌజన్య,సయ్యద్ ముజాహిద్ హుస్సేన్,పుచ్చకాయల వీరభద్రం, మొక్కా శేఖర్ గౌడ్,సయ్యద్ గౌస్,కార్పొరేటర్లు మలీదు వేంకటేశ్వర్లు, లకావత్ సైదులు నాయక్, నగర కాంగ్రెస్ నాయకులు మిక్కిలినేని నరేందర్, పల్లెబోయిన భారతిచంద్రం, ముడుముంతల గంగరాజు యాదవ్,షేక్ అబ్బాస్ భేగ్, బాణాల లక్ష్మణ్, అనిల్,ఏలూరి అనిల్, దొడ్డా ప్రవీణ్, జహీర్ భాయ్, జాని, గడ్డికొప్పుల ఆనంద్ రావు, గజ్జి సూర్యనారాయణ, కమతం రామక్రిష్ణ, బడేమియా, నూకారపు వేంకటేశ్వరరావు, గడ్డం వెంకటయ్య, మందపల్లి నాగమణి, ప్రతిభారెడ్డి, ఫరీద్ ఖాద్రి, తదితర నాయకులు పాల్గొన్నారు.




