- Advertisement -
ప్రకృతి సేద్యంపై మెక్సికో బృందం పర్యటన
Mexico team tour on landscapingచిత్తూరు
సేంద్రియ విధానాలకు ఆధునిక పద్ధతులు జోడించి ప్రకృతి వ్యవసాయం సాగిస్తున్నట్టు రైతు సాధికార సంస్థ ఛైర్మన్ విజయ్ కుమార్ తెలిపారు. ఆంధ్రలో జరుగుతున్న ప్రకృతి సేద్యంను పరిశీలించేందుకు 15 మంది సభ్యులతో మెక్సికో బృందం పర్యటిస్తోంది. ప్రకృతి సేద్యంలో 100 శాతం పొదుపు సంఘ సభ్యులను భాగస్వామ్యులను చేస్తున్నామని విజయ్ కుమార్ చెప్పారు. మహిళా రైతులు ఆదర్శవంతంగా పనిచేస్తూ వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు సాధిస్తున్నారని వెల్లడించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో 291 పొదుపు సంఘాలు ఈ ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాయని… వాటిని ప్రోత్సహించేందుకు మహిళలతో మార్కెట్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. వరి, మామిడి, వేరుసెనగతో పాటు 37 రకాల కూరగాయలను రసాయన ఎరువులను వాడకుండా సాగుచేస్తున్నారని వెల్లడించారు. ఈ పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. మెక్సికో ప్రతినిధి డియాజ్ మరియా మాట్లాడుతూ మహిళలను వ్యవసాయ రంగంలో ప్రోత్సహించడాన్ని అభినందించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, సురేష్ బాబు, సుధాకర్, సందీప్, శివాజీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




