జగన్ పాలనలో ఉద్యోగులకు కనీసం జీతాలు ఇవ్వలేని దుస్థితి
Under Jagan's rule, the employees were not able to pay minimum salariesమాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి
ఆమడగూరు:20
జగన్ పాలనలో అన్ని రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి గత ఐదేళ్ల లో సాగిందని అన్నారు. జగన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల ఆస్తులను కొట్టేయాలని ప్లాన్ వేశాడు. అది ఎన్నికల్లో పూర్తిగా బెడిసి కొట్టి ప్రజలు వైసిపి నీ తరిమి కొట్టారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ యాక్ట్ రద్దు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా విజయవాడ వరద బాధితులను ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆదుకోవాలని మాజీ మంత్రి కోరారు. అనంతరం పూలకుంట్లపల్లి పంచాయతీ లో రూ.13 లక్షలతో సీసీ రోడ్లు ను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రామనాథ రెడ్డి, ఎంపిడిఓ మునెప్ప , పీఆర్ ఇంజనీర్ గుప్తా, సర్పంచ్ , టీడీపీ నాయకులు మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మెన్ కృష్ణమూర్తి, మాజీ. జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కాలే నాయక్, మాజీ సర్పంచ్ కాంతమ్మ ,రామనాయక్ ,కృష్ణారెడ్డి, రాజా రెడ్డి , అధి కారులు ,టీడీపీ ,జన సేన, బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




