పంట పొలాల రైతులు జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు

- Advertisement -

పంట పొలాల రైతులు జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు

Farmers of crop fields should be careful officials

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు , ఎమ్మార్వో   రేముడాల ధ్రువ కుమార్

సూర్యాపేట జిల్లా ,సెప్టెంబర్ 20:
మునగాల మండల పరిధిలోని బరకత్ గూడెం గ్రామ రెవెన్యూ శివారు, పోలేని గూడెం పరిధి వద్ద ఎస్కేప్ కాలువలో  గత రెండు రోజుల క్రితం బరాకత్ గూడెం గ్రామానికి చెందిన రైతు తన పంట పొలం వద్ద మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లగా అటువైపు కాలువ లో ముసలి కనిపించడంతో భయంతో ఈ సమాచారం గ్రామస్తులకు చేరవేశాడు. దానితో గ్రామ ప్రజలు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా వారు  సంఘటన స్థలాన్ని పరిశీలించారు .ముసలి సంచరించి ఉన్న కాలువ సమీపంలోని చుట్టూ ఉన్న పంట పొలాల రైతులు కాల్వలోకి దిగేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు .ఈ సందర్భంగా చిలుకూరి ఎమ్మార్వో రేముడాల ధ్రువ కుమార్ మాట్లాడుతూ, ఇట్టి సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు అందజేశామని వారు తెలిపారు. ఈరోజు శుక్రవారం సంఘటన స్థలాన్ని ఫారెస్ట్ అధికారులు పరిశీలించి చుట్టుపక్క రైతులను విషయం అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతమంతా పరిశీలించగా ముసలి కనిపించకపోవడంతో వారు రైతులను ఎలాంటి ఆందోళన పడవద్దు అని జాగ్రత్త పాటించాలని ముసలి కనిపించిన, కదలికలు కనిపించిన వెంటనే తమకు  సమాచారం అందించాలని  రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు ఎఫ్ బి ఓ  శ్రీనివాస్, ఎఫ్ ఎస్ ఓ ఎం ఏ ఖదీర్ ,ఎఫ్ ఆర్ ఓ పి జ్యోతి ,రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular