శ్రీకాళహస్తి…. ఆలయానికి మళ్లీ ఇన్చార్జి ఇఓ…?
Srikalahasti....is the in-charge of the temple again...?ఆజాద్ బాధ్యతలు తీసుకుంటారా…?
ఈవోగా మళ్లీ ఆర్డీవో రానున్నారా …?
శ్రీకాళహస్తి సెప్టెంబర్ 20
శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం మళ్లీ ఇన్చార్జి ఈవో పాలనలోకి రాబోతోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవాదాయ శాఖ తిరుపతి ఆర్జెసి ఎన్వీసెన్ మూర్తిని ఇన్చార్జి ఇఓగా నియమించింది. ప్రభుత్వం ఆయన్ను ద్వారకా తిరుమల ఆలయానికి బదిలీ చేసింది. సుమారు 90 రోజులు పాటు ఆయన ఇన్చార్జి ఇఓగా వ్యవహరించారు. అన్నవరం ఇఓగా ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ ప్రభుత్వం తిరుపతి ఆర్జెసి గా బదిలీ చేసింది. శ్రీకాళహస్తి దేవస్థానంకు మాత్రం ఇఓగా ఎవరినీ నియమించలేదు. తిరుపతి ఆర్జెసి గా బాధ్యతలు నిర్వహించనున్న చంద్రశేఖర్ ఆజాద్ ఇన్చార్జి ఇవో గా బాధ్యతలు తీసుకుంటారని ప్రచారం. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఈవోగా దేవాదాయశాఖలో ఆర్జెసి స్థాయి అధికారి… లేదా రెవెన్యూ అయితే స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ను నియమించాలి. గత ప్రభుత్వం డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులను నియమించి ఇష్టానుసారం అన్యాయాలు.. అక్రమాలు చేసిందనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మారిన వెంటనే దేవాదాయ శాఖకు చెందిన తిరుపతి ఆర్జెసి మూర్తి ఇన్చార్జిగా నియమించ బడ్డారు. ఆయన ద్వారకా తిరుమల దేవస్థానం ఇఓగా బదిలీ అయ్యారు. అన్నవరం దేవస్థానం ఇఓ చంద్రశేఖర్ ఆజాద్ ను తిరుపతి ఆర్జెసి గా బదిలీ చేసింది. ఆయనే శ్రీకాళహస్తి ఆలయానికి ఇన్చార్జి ఈవోగా వ్యవహరించనున్నారు. రాహు కేతు పూజలను గణనీయంగా పెంచడానికి… మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి… ప్రపంచ స్థాయి అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పదేపదే చెబుతున్నారు. అయితే రెగ్యులర్ ఈవో నియామకం జరగలేదు.అయితే దేవస్థానం ఇఓగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ను నియమించాల్సి ఉంది. ఆర్డీవో స్థాయి అధికారులైతే డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు మాత్రమే. ఆలయానికి ఏడాదికి సుమారు 150 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది. జూనియర్ ఐఏఎస్ ను నియమించి పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తే ఆలయ ఆదాయం పెరగడమే కాకుండా… రాహుకేతు పూజలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. అయితే ఆర్డీవో స్థాయి అధికారిని నియమించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండక పోవచ్చు. (గత అనుభవాల ద్వారా) గతంలో ఆర్డీవోగా ఉండిన వై. రామచంద్ర రెడ్డిని టీడీపీ ప్రభుత్వం దేవస్థానం ఇఓగా నియమించింది. అయితే ఆర్డీవో స్థాయి అధికారి ఇఓగా ఉండడానికి పనికిరారని బిజెపి నాయకులు హైకోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తీసుకొచ్చారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఆయనను హడావుడిగా బదిలీ చేసింది. అంతేగాకుండా గత ప్రభుత్వంలో ఆర్డీవో స్థాయి అధికారులు ఈవోలుగా ఉండడం వల్ల అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. తిరుపతి ఆర్జెసి గా నియమితులైన చంద్రశేఖర్ ఆజాద్ను ప్రభుత్వం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక అధికారిగా నియమించింది. అయితే ఆయన శ్రీకాళహస్తిలో విధులు నిర్వహించడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. అటువంటి అధికారి ఇన్చార్జిగా వ్యవహరిస్తారా…? లేదా అనేది కూడా ప్రశ్నార్థకమే. స్థానికంగా ఉన్న రాజకీయాలు… ఆలయం పై వస్తున్న అవినీతి,అక్రమాల, ఆరోపణలు… స్థానికంగా ఉన్న అధికారులు సిబ్బందిపై ఆయనకున్న అభిప్రాయాల కారణంగా శ్రీకాళహస్తి ఆలయానికి ఈవోగా రావడానికి గతంలోనే ఆయన తిరస్కరించారు.ఆర్డీవో ను ఈవోగా నియమిస్తే గతంలో హైకోర్టుకు వెళ్లిన బీజెపీ నాయకులు కూటమిలో ఉన్నారు. తిరిగి కోర్టుకు వెళతారా…? లేదంటే అభ్యంతరం చెబుతారా..? ఎర్ర తివాచీతో స్వాగతం పలుకుతారా…? ఇన్చార్జి ఈవోగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారు…? పూర్తిస్థాయి బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు..? అనేది వేచి చూడాల్సిందే…




