- Advertisement -
డివైడర్ ను ఢీకొన్న కారు..ఇద్దరికి తీవ్ర గాయాలు
The car collided with the divider..Two were seriously injuredఖమ్మం
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఖమ్మం నుంచి రాజమండ్రి నేషనల్ హైవే పై అర్ధరాత్రి ఒక కారు అతివేగంగా వస్తూ అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు యువకులు గంజాయి మత్తులో ఉన్నట్లు స్థానికులు ఆరోపణ చేస్తున్నారు. మత్తులో కారును అత్యంత వేగంగా నడపడంతో అదుపుతప్పి నేషనల్ హైవే పై ఉన్న డివైడర్ను ఢీకొనడంతో కారు గాల్లో ఎగిరి 100 మీటర్ల దూరంలో పడింది. రోడ్డు ప్రమాద తీవ్రతకు యువకులకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరా లో రికార్డు కావడంతో వైరల్ అయ్యాయి.
- Advertisement -




