పామిడి పోలీస్ స్టేషన్ లో ఎడ్లబండ్లతో నిరసన

- Advertisement -

పామిడి పోలీస్ స్టేషన్ లో ఎడ్లబండ్లతో నిరసన

Protest with cow-vehicles in Pamidi Police Station

గుంతకల్
అనంతపురం జిల్లా, గుంతకల్లు నియోజకవర్గం, పామిడి గ్రామం లోని పెన్నానది నుండి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న 12 ఎద్దులబండ్లను పోలీసులు పట్టుకున్నారు. సీఐ యుగంధర్ ఆధ్వర్యంలో పోలీసులు పెన్నానది నుంచి ఇసుకను తరలిస్తున్న ఆ బండ్లను అదుపులోనికి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు.  సీజ్ చేసిన వాటిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించి, కేసు నమోదు చేశారు.  ఒక్కో ఎద్దులబండి యజమానికి రూ.50 వేల సొంత పూచికత్తుతో తహశీల్దార్ ముందు బైండోవర్ చేశారు.  ఇది ఇలా ఉంటే ఎద్దులబండ్ల నిర్వాహకులు మాత్రo అధికారులపై దుమ్మెత్తి పోశారు.  పొట్టకూటికోసం ఎద్దులబండ్లతో పెన్నానది నుంచి ఇసుకను తరలిస్తున్న మాపై బ్రహ్మాస్త్రం ప్రయోగించారు..  మరి టిప్పర్ల తో, లారీలతో అక్రమంగా తరలిస్తున్న వారిపై ఎందుకు కేసులు పెట్టరు అని ప్రశ్నించారు.  బడా నాయకులు ఇసుక ను అక్రమంగా తరలించి, బెంగళూరు లో అధిక ధరకు అమ్ముకుంటున్నారని.. పోలీసులు వారిని చూసి చూడనట్లు వదిలేస్తున్నారని పట్టుబడ్డ ఎద్దులబండ్ల యజమానులు ఆరోపణలు చేశారు.  తమ ఎద్దుల బండ్లను పోలీస్ స్టేషన్ లో పెట్టి నిరసన చేశారు.  మండల కేంద్రంలో ట్రాక్టర్లు తిప్పలతో ఇసుక తరలిస్తున్న వాటిని వదిలేసి పొట్టకూటి కోసం ఎడ్లబండలో ఇసుకన తరలిస్తున్న మమ్మల్ని పట్టుకోవడం చాలా దారుణం అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular