బుడమేరు, కొల్లేరు గండ్లు, అక్రమణలు గుర్తించండి-మంత్రి నిమ్మల రామానాయుడు

- Advertisement -

బుడమేరు, కొల్లేరు గండ్లు, అక్రమణలు గుర్తించండి-మంత్రి నిమ్మల రామానాయుడు

Identify irregularities Budameru, Kolleru Gandlu-Mantri Nimmala Ramanaidu

విజయవాడ
అకాల వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న కాలువలు, డ్రైన్లు,చెరువులకు పడిన గండ్లను  యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి,  ఆఖరి ఎకరం వరకు సాగు నీరు అందించాలనే  ఉద్దేశంతో నేడు జలవనరుల శాఖ మంత్రి  నిమ్మల రామానాయుడు,  ఇరిగేషన్ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు లతో కలిసి ఈస్ట్ గోదావరి, కాకినాడ,కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల కలెక్టర్లు , రాష్ట్రంలోని ఇరిగేషన్  సి ఇ, ఎస్ఈ, ఈఈ లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద నష్టం,గండ్ల పూడిక పనులపై జిల్లా కలెక్టర్లు,ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు, ఎస్ ఇ, ఈఈ లతో అత్యవసర సమావేశం జరిగింది. గట్లకు ఎక్కడెక్కడ గండ్లు పడ్డాయో గుర్తించిన వాటిని వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. కలెక్టర్లు సైతం క్షేత్రసాయిలో పర్యవేక్షించి అత్యవసర పనులుగా గండ్లను కలెక్టర్ స్థాయిలోనే అనుమతులు ఇచ్చి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఆఖరి ఎకరం వరకు రైతులకు సాగునీటి సరఫరాలో ఇబ్బంది రాకుండా చూడాలి. గోదావరి డెల్టా సిస్టమ్ లో ప్రధానంగా ఏలేరు, అమ్మిలేరు, ఎర్ర కాలువ, బుడమేరు, కొల్లేరుకు సంబంధించి గండ్ల తో పాటు ఆక్రమణ కూడా గుర్తించి నివేదిక ఇవ్వండి. కృష్ణ డెల్టా సిస్టమ్ లో ఏలూరు, బందరు, బుడమేరుతోపాటు గూడూరు ఛానల్ గండ్లతో పోల్చడంతోపాటు బకింగ్ హాం కెనాల్ శివారు ప్రాంతం వరకు నీరు అందాలి. నాగార్జునసాగర్ కుడి కాలువ,చివరికి సాగునీరు అందడంతో పాటు  ఎడమ కాలువ కింద ఉన్న కాలువలు, చెరువులు గండ్ల ను పూడ్చాలి. గండ్ల పూడిక కు సంబందించి తాత్కాలికంగ చేసిన పనులను పర్మినెంట్ గా నాణ్యతతో పూర్తి చేయాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular