వ్యవసాయంలో సేంద్రియ ఎరువులు వాటి ప్రాముఖ్యత

- Advertisement -

వ్యవసాయంలో సేంద్రియ ఎరువులు వాటి ప్రాముఖ్యత

Organic fertilizers and their importance in agriculture

నేల సారవంతం సేంద్రియ ఎరువులతోనే సాధ్యం
వినూత్న అగ్రోటేక్ ఎల్ఎల్ పి ఎరువులపై రైతులకు అవగాహన
ఆళ్లగడ్డ
ప్రస్తుత వ్యవసాయ రంగంలో సేంద్రియ ఎరువుల ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారని వినూత్న ఆగ్రోటెక్ ఎల్ ఎల్ పి మార్కెట్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ బిల్లా రాజేష్ యాదవ్ అన్నారు.శనివారం ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని చింతకుంట గ్రామంలో వినూత్న ఆగ్రోటెక్ ఎల్ ఎల్ పి సంత ఆధ్వర్యంలో వ్యవసాయంలో సేంద్రియ ఎరువులు వాటి ప్రాముఖ్యత సేంద్రీయ ఎరువులతో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు చేపట్టవలసిన జాగ్రత్తలు, సూచనలపై రైతు సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ఆఫీసర్ బిల్లా రాజేష్ యాదవ్ తో పాటు యస్ ఓ , మస్తాన్, ఎఫ్ ఎ, దస్తగిరితదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు సదస్సు కార్యక్రమంలో వారు నేటి వ్యవసాయంలో రసాయన ఎరువులు మరియు రసాయన మందులు వాడటం నానాటికి పెరుగుతుందన్నారు. వీటి ప్రభావం వల్ల మనకు తెలియకుండానే భూమిలో ఉన్న జీవరాశులపై అధికంగా ఒత్తిడి పెరగడంతో పాటు అధిక రసాయన ఎరువులు వాడటం వలన భూమిలోని జీవరాశులలో అతి ముఖ్యమైన సముదాయమైన సూక్ష్మంగా జీవులు పై పడి వాటి సంఖ్య తగ్గిపోతుంది అన్నారు. తద్వారా గణనీయమైన మార్పులు భూమిలో సంతరించుకొని భూమికి ఉన్న సహజ గుణాలు మరియు భూ ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీనిస్తుందన్నారు. తద్వారా రైతుకు పెట్టుబడి విషయంలో అధికమైన భారం కూడా పడుతుందన్నారు.”వినూత్న ఆగ్రో టెక్ఎల్.ఎల్.పి.” సంస్థ గత 2 సంవత్సరాలుగా సేంద్రీయ, జీవన ఎరువులను అందిస్తుందన్నారు.సేంద్రియ ఎరువులు వాడటం వల్ల రైతులకు పెట్టుబడి తగ్గడంతో పాటు భూమి సారవంతంగా తయారవుతుందన్నారు.సేంద్రియ జీవన ఎరువులైన”యోధ సేంద్రియ ఎరువులు, యోధ సి ఎం ఎస్,జీవన్ గోల్డ్,  రైతుమిత్ర, ప్రణయ్,  గ్రో హై గ్రాన్యూల్స్,  గ్రో హై లిక్విడ్,  డెల్టా ప్రో,  తులిప్,  యువరాజ్, డైనమైట్, జనని, ట్రిగర్ II, టర్బో II, కే జి ఎఫ్ 6, రోషిని, ఉజ్వల్ II, త్రిసూల్, ధర్మవీర్ ,  రత్నా,  పృధ్వీరాజ్, తిరంగా,  నైట్స్,  త్రిలోక్,  ఇగ్నిస్ 5  అవనీ న్యూట్రిన్, అవనీ గోల్డ్, అవనీ జింక్ ప్లస్ (జెడ్33%+ఎస్15%), అవనీ న్యూట్రిసోల్ (కే ఎం ఎస్-22.18.20), అవనీ కాబన్, అవనీ సీ గోల్డ్ (పౌడర్/గ్రానువాల్స్) , అవనీ సీ గోల్డ్ (లిక్విడ్), అగ్ని, విభా ప్లస్, వాల్ట్, ధన్వి , వాల్ యు ప్యాక్, టిల్లరింగ్ బోస్టర్, సాయిల్ రిసువేటర్,  లను పంటకు అధిక దిగుబడులు ఇవ్వడంతో పాటు ఎక్కువ లాభాలు రైతులు పొందుతారన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు. రైతు సోదరులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular