యువత స్వచ్ఛందంగా రక్తదానం గర్వించదగ్గ విషయం

- Advertisement -

యువత స్వచ్ఛందంగా రక్తదానం గర్వించదగ్గ విషయం

Voluntary blood donation by youth is a matter of pride

పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్
పత్తికొండ
యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం గర్వించదగ్గ విషయం పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ అన్నారు. పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తల సేమియా వ్యాధితో బాధపడుతున్న వారికోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ప్రిన్సిపాల్ మాధురి, పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రి గైకాలజిస్ట్ డాక్టర్ కల్పన, ఆదోని బ్లడ్ మెడికల్ క్యాంపు డాక్టర్ జగదీష్, ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ హాజరయ్యారు, అనంతరం వారు మాట్లాడుతూ యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఆపదలో ఉన్న వారికి రక్తం చాలా అవసరం ఉంటుందని అన్నారు. కాబట్టి రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చు అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులకు, రోడ్డు ప్రమాదానికి గురైన వారికి ఈ రక్తం ఉపయోగపడుతుందని అన్నారు. పత్తికొండ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు 100 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ శిబిరంలో సేకరించిన రక్తాన్ని తల సేమియా వ్యాధి పిల్లలకు, రక్త హీనతతో బాధపడుతున్న చిన్నారులకు అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిన లోకనాథ్, నరసింహ చౌదరి, శ్రీధర్ రెడ్డి, ప్రకాష్ , దేవయ్య మెడికల్ క్యాంపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular