- Advertisement -
పార్టీకి కార్యకర్తలే బలం…వారి త్యాగాలను మర్చిపోలేం
Workers are the strength of the party...their sacrifices cannot be forgottenత్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ
దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు
అమరావతి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నాడు పార్టీ నేతలు,మంత్రులతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, నేతల త్యాగాలను విస్మరించబోము. కార్యకర్తలకు ఇచ్చే ప్రమాద బీమాను రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాం. స్వతహాగా ఎదిగేలా ఎంపవర్ మెంట్ చేస్తాం. పార్టీ స్కిల్ డెవలప్మెంట్, ఎంపవర్మెంట్ విభాగం ద్వారా యువతకు వివిధ కంపెనీలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన వల్ల జరిగిన నష్టాన్ని ప్రజా క్షేత్రంలో వివరించాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో మనం చేసిన పనులు ప్రజలకు తెలపాలి. గత పాలకులు పాపాలను ప్రజలకు తెలియజేయాలి. సంక్షేమం,అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది మంచి ప్రభుత్వమని అన్ని వర్గాలు సంతోషంగా చెబుతున్నాయి.
• 2029 నాటికి టీడీపీని తిరుగులేని శక్తిగా మారుస్తా.
ప్రజల సెంటిమెంట్ తోనూ ఆడుకునే స్థాయికి గత పాలకులు దిగజారారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించారని అన్నారు.ప్రజల ఇసుక కష్టాలు తీర్చడం కోసం ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చాం. లోడింగ్, సీనరేజ్, రవాణా ఖర్చులు పెట్టుకుంటే చాలు…ఇసుక కొనుగోలుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మద్యం విధానాన్ని ప్రక్షాళన చేశాం. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కల్తీ మద్యాన్ని అరికట్టాం. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. 2029 నాటికి నిరుపేదలందరికీ ఇళ్ళు నిర్మించి ఇచ్చే లక్ష్యంతో ఏడాదిలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం టార్గెట్ గా ముందుకెళ్తామని అన్నారు.
విజయవాడ వరద బీభత్సానికి అతలాకుతలమైంది…బాధితులకు అండగా నిలబడ్డాం. వరదల్లో మునిగిన ఇంటికి రూ. 25 వేలు, హెక్టారు వరికి రూ.25 వేలు ఆర్థిక సాయం ప్రకటించాం. మోటార్ వెహికిల్స్ పాడయితే రూ.3 వేలు ఇవ్వడంతో పాటు, ఇంట్లోకి నీరొచ్చిన వారికి ఆర్థిక సాయం అందిస్తున్నాం. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకుని దాతలు ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్నారు. ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని త్వరితగతిన పూర్తిచేస్తాం. జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం అనాధలా మిగిలిపోయింది. కేంద్ర బడ్జెట్ లో అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. త్వరలోనే రాజధాని పనులు మొదలుపెడతాము. అమరావతికి ప్రసిద్ధ విద్యా సంస్థలు వస్తున్నాయి. రాష్ట్రమంతటా సోలార్ వెలుగులు నింపేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాము. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి కేంద్రం హామీ ఇచ్చింది. జలవనరులు, జాతీయ రహదారుల ప్రాజెక్టులు, మౌలిక వసతులకు రూ. 2 వేల 500 కోట్లు రాష్ట్రానికి వచ్చాయి. ప్రజలంతా ఇది మంచి ప్రభుత్వం అని భావిస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఖజానాలో డబ్బులు లేకపోయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాం. గత అసమర్థ పాలనతో ప్రభుత్వంలోని పలు విభాగాలు గాడితప్పాయి. వాటిని సరిదిద్దుతున్నాము. పెండింగ్ బిల్లులను విడుదల చేస్తూ ముందుకు పోతున్నాము. మనది ప్రజా ప్రభుత్వం…ఆర్భాటాలు లేవు. 100 రోజుల్లో ఏం చేశామో ప్రజలకు చెప్పండి. నేతలు ఇంటింటికీ వెళ్లాలి. గ్రామ, వార్డు సచివాలయాతో పార్టీ ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకోవాలి. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలెండర్స్ ఇస్తాం. మనం చేసిన మంచి పనులు అందరికీ తెలియాలి. చారిత్రాత్మక విజయం అందించిన ప్రజలకు మనం సంక్షేమం, అభివృద్ధి అందించాలని అన్నారు.
- Advertisement -




