ఏకాత్మతామానవతావాదాన్ని ప్రతి పాదించిన మహనీయుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ

- Advertisement -

ఏకాత్మతామానవతావాదాన్ని ప్రతి పాదించిన మహనీయుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ

Deen Dayal Upadhyay was the great advocate of monotheistic humanism

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎం పి దగ్గుబాటి పురంధేశ్వరి
అమరావతి సెప్టెంబర్ 25
బిజెపి రాష్ట్ర కార్యాలయం లో పండిట్ దీన్ దయాళ్ జీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథి గా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎం పి దగ్గుబాటి పురంధేశ్వరి హాజరై పూలమాలలు వేశి ఘనంగా నివాళ్ళు అర్పించారు.ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు   దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీ ఏకాత్మతామానవతావాదాన్ని ప్రతి పాదించిన మహనీయుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ .దేశ సంస్కృతి ఆధారంగా పాలనా విధానాలను ఆయన ప్రతిపాదించారు.దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీ భావజాలాన్ని బిజెపి పుణికి పుచ్చుకుందని అందువల్ల అంత్యోదయ సిద్దాంతం ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారు.బిజెపి శ్రేణులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీ ఆలోచనలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తారన్నారు.ఈరోజు రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు నిర్వహించాలని పురంధేశ్వరి పిలుపు ఇచ్చారు ఈకార్యక్రమంలో బిజెపి మీడియా రాష్ట్ర ఇంఛార్జి పాతూరి నాగభూషణం, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా కిషోర్, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బిజెపి రాష్ట్ర కోశాధికారి కందుకూరి సత్యనారాయణ , ఎన్టీఆర్ జిల్లా పార్టీ ఇంఛార్జి బ్రహ్మం,ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం,మాదల రమేష్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular