- Advertisement -
జనసేన సంఘీభావ దీక్ష
Jana Sena Sanghibhava Dikshaవిశాఖపట్నం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయా రీలో కల్తీ చేసిన నెయ్యి విని యోగం భక్త జనకోటి మనోభావాలను దెబ్బ తీసింది. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి వ్యవహా ర శైలి, లడ్డూ కల్తీ ద్వారా చేసిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా విశాఖ జనసేన పార్టీ విశాఖ నగర అధ్య క్షులు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎల్ఐసి బిల్డింగ్ వద్ద మహా యాగం చేపట్టారు.ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుమల ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారని, లడ్డూ తయారీలో కల్తీ ఘటనపై ప్రతి ఒక్కరిలో వేదన ఉందని,గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీ భావం తెలియచేయడం అందరి బాధ్యత అని చెప్పారు
- Advertisement -




