- Advertisement -
టిడిపి వంద రోజుల పాలన ప్రజా వంచక పాలనగా సాగింది
TDP's 100-day rule was a public treachery– పరవాడ వైస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు కోన రామారావు
పరవాడ
కుటమి ప్రభుత్వం వంద రోజుల పాలన ప్రజా పంచక పాలన అని వైసిపి మండల పార్టీ అధ్యక్షుడు కోన రామారావు విమర్శించారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన గురించి గొప్పలు చెప్పుకుంటుంది తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఒక్క పథకం అన్నా అమలు చేశారా అని ప్రశ్నించారు. కేవలం ఎన్నికల సమయంలో ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వాటిని తుంగలో తొక్కేస్తారని ప్రజల గ్రహించకపోవడం విచారకరమన్నారు. ఎటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీల అమలు చేయకుండా తమ వంద రోజుల పాలన గురించి చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కోన రామారావు విమర్శించారు. కూటమి ప్రభుత్వ వంద రోజులు పాలనలో కక్షలు, కార్పన్యాలు, అక్రమ కేసులు, నిర్బంధాలు, ప్రభుత్వ అధికారులను భయపెట్టే విధానం తప్ప ఇంకేమీ లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజల పక్షంగా ప్రశ్నిస్తాను అనే పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని చంద్రబాబు నాయుడు ను ఎందుకు ప్రశ్నించట్లేదని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాల పథకం హామీలను ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టగానే అమలు చేశారని గుర్తు చేశారు. ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కోన రామారావు పత్రికా ప్రకటనలో తెలిపారు.
- Advertisement -




