సండ్రపాలెంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
It is a good government program in Sandrapalemఇంటింటికి టిడిపి నాయకులు కరపత్రాలు పంపిణీ
పిడుగురాళ్ల,
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో
ఈ 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలు,సాధించిన విజయాలను “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం గురించి పిడుగురాళ్ల మున్సిపాలిటీ పరిధిలోని సండ్రపాలెం 1వ వార్డుల ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 1వ వార్డు ఇంచార్జ్ దేవళ్ళ కామేశ్వరరావు, పల్నాడు జిల్లా తెలుగు యువత కార్యదర్శి దేవళ్ల దుర్గారావు, దేవళ్ళ వెంకయ్య, తమ్మిశెట్టి లక్ష్మయ్య, ఉప్పుతల వెంకటేశ్వర్లు, బత్తుల రాజు, యర్రగాని నాగమల్లి, దేవల చిన్న దుర్గారావు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు,కార్యకర్తలు,1వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.




