రైతు బాధితులను ఆదుకోవాలి

- Advertisement -

రైతు బాధితులను ఆదుకోవాలి

We should support farmer victims

కాకినాడ
కాకినాడ జిల్లా ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన రైతులకు  కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని పిఠాపురం నియోజకవర్గం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వంగా గీత విశ్వనాథ్ ప్రభుత్వాన్ని కోరారు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సగిలి శన్మోహన్ ను కలిసి రైతు సమస్యలపై  వినతిపత్రం సమర్పించారు.ఈసందర్భంగా వంగా గీత మాట్లాడుతూ ఏలేరు వరదలతో పిఠాపురం నియోజవర్గంలో దాదాపు 20 వేల ఎకరాల్లో  పంట నష్టం వాటిల్లిందని నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించి ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని పొలాల్లో వేసిన ఇసుక  మేటలను ఉపాధి హామీ ద్వారా తొలగించాలని కోరారు అదే విధంగా గొల్లప్రోలు జగనన్న కాలనీ కి వెళ్లే మార్గమధ్యలో సుద్ద గడ్డ వాగు మీద వంతెన నిర్మించాలని,పిఠాపురంలో  రైల్వే ఫ్లైఓవర్ వంతెన పనులను త్వరితగతిన పనులు చేపట్టాలని కలెక్టర్ను కోరామని తెలిపారు…ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండలం జెడ్పిటిసి గుబ్బల తులసి కుమార్,నాయకులు రావు చిన్నారావు,గండేపల్లి బాబి,కొప్పన శివ,తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular