వరదలలో నష్టపోయిన వారిని, వివక్ష లేకుండా ప్రభుత్వం ఆదుకోవాలి

- Advertisement -

వరదలలో నష్టపోయిన వారిని, వివక్ష లేకుండా ప్రభుత్వం ఆదుకోవాలి

The government should support the flood victims without discrimination

 మొండితోక జగన్ మోహనరావు
నందిగామ
ఇటీవల వరదలకు ముంపు కి గురైన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అన్నారు.  ఈమేరకు  ఆ గ్రామాల  నాయకులు ,ప్రజాప్రతినిధుల తో కలసి నందిగామ ఆర్డీవో కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఇటీవల కురిసిన వర్షాలు వరదలు కారణంగా ముంపు  గురై ఇల్లు దెబ్బతిని గృహఉపయోగ వస్తువులు నష్టపోయి బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులు స్పందించకపోవడం శోచనీయమని అన్నారు.  నియోజకవర్గంలో 4 మండలాల్లో ఆయా గ్రామాలు నివాస గృహాలు వరద ముప్పుకు గురయ్యాయని  ఇళ్లలోని ఫ్రిజ్లు మిక్సీలు విద్యుత్ మోటార్ గృహ ఉపయోగకర సామాగ్రి సమస్తం దెబ్బతిన్నాయని  వరద ముంపుకు గురై రోజులు గడుస్తున్న అధికారులు ఇప్పటివరకు గ్రామాలను  పరిశీలించడం కానీ నష్టాన్ని అంచనా వేయటం కానీ నష్టపరిహారం అందించడం కానీ జరగలేదని పేర్కొన్నారు.  ప్రక్క నియోజకవర్గాల లో గ్రామాలలో  నష్టం అంచనా వేసి నష్టపరిహారం కూడా అందించటం జరిగిందని మన నియోజకవర్గంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాలలో వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్డిఓ కి వినతి పత్రం అందించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular