- Advertisement -
సంక్షేమ అభివృద్ధి కూటమితోనే లక్ష్యం..
Kutami goal is welfare development...బద్వేలు తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త రితేష్ రెడ్డి
బద్వేలు
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే చెప్పిన హామీలను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని టిడిపి నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి పేర్కొన్నారు. చెప్పిన మాట కోసం పెన్షన్ భరోసా పథకాన్ని అమలు చేశారని అదే విధంగా డీఎస్సీ నియామకాల నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు.. పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యమని ఆయన అన్నారు.. బి. కోడూరు గ్రామపంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. ప్రజలకు చెప్పిన హామీలను నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. అదేవిధంగా పాదయాత్రలో ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను ప్రజా దర్బార్ ద్వారా పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న ,టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




