జన రంజిక పాలన మన మంచి ప్రభుత్వం తోనే సాధ్యం

- Advertisement -

జన రంజిక పాలన మన మంచి ప్రభుత్వం తోనే సాధ్యం

పౌష్టికాహార మహోత్సవాలు కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
.

తాడేపల్లిగూడెం,సెప్టెంబర్ 28..

Democratic governance is only possible with our good government

రాష్ట్రంలోజన రంజికమైన పాలన మన మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యం వందరోజుల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనే భావన అందరిలో కలుగుతుందని  తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక వికర్స్ కాలనీ నాన్న కళ్యాణ మండపంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సామూహిక శ్రీమంతం, పౌష్టికాహార పంపిణీ, మిషన్ వాత్సల్య పథకం  ద్వారా లబ్ధిదారులకు అందించే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి ఖాళీ ఖజానాతో పాలన మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు తన అనుభవాన్ని అంతా జోడించి సకాలంలో జీతాలు చెల్లించడంతోపాటు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా పాలన కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో నిధులు లేకున్నా ఎన్డీఏ కూటమిలో ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించకుండా నేరుగా ప్రజలకే పథకాలు అందేలా ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. పంచాయతీ నిధులను దారి మళ్లించి గ్రామాలను అభివృద్ధికి ఆమడ దూరం నిలిపిన ఘనత వైయస్ జగన్ కు దక్కుతుందని, అలాంటి పరిస్థితుల నుండి ఆర్థిక సంఘ నిధులను నేరుగా పంచాయతీలకు ఇవ్వడం ద్వారా కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల అభివృద్ధికి విశేష కృషి చేస్తుందన్నారు. ఐదేళ్లలో  60 మంది పనికిమాలిన సలహాదారులను నియమించుకొని కోట్ల రూపాయల ప్రజాధనం వారికి జీతాలకు, జల్సాలకు ఇచ్చిన ఘనత గత ప్రభుత్వాన్ని అన్నారు. సలహాదారులకు ఇచ్చిన జీతాలతో ఎన్నో ప్రాంతాల అభివృద్ధి అయ్యేవని గత ప్రభుత్వా అనాలోచితి నిర్ణయాలే రాష్ట్ర అభివృద్ధి కుంటుబడడంలో ప్రధాన పాత్ర పోషించందని అన్నారు. హిందువులకు అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదాన్ని సైతం కల్తీ చేసిన ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుందన్నారు,అంతేకాకుండా ప్రభుత్వం అందించే పౌష్టిక ఆహారాలతో పాటు బాలింతలకు, చిన్నారులకు ఆయన సొంత నిధులు 30,000 రూపాయల వేర్చించి వివిధ రకాల పౌష్టికాహారం బొలిశెట్టి శ్రీనివాస్ అందజేశారు. అనంతరం మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ప్రభుత్వ నిధులు 4,000 రూపాయలు చొప్పున అందజేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జి, బిజెపి ఇన్చార్జ్ ఈతకోట తాతాజీ, మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు,కూటమి నాయకులు అడబాల నారాయణమూర్తి, పాలూరి వెంకటేశ్వరరావు, పట్నాల రాంపండు,పుల్లా బాబి,పరిమి రవి,గుండుమోగుల సురేష్, నల్లగంచు రాంబాబు,పై బోయిన వెంకటరామయ్య,మద్దాల మణికుమార్,చాపల రమేష్,లోవరాజు,అల్లు సత్య, అనిల్, వెజ్జు రత్న కుమారి,అడపా జమున, ముద్దాల లక్ష్మి ప్రసన్న,కొల్లి రామావతి, మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular