ఎమ్మెల్యే సహకారంతో మురికి కాలువ  పూడిక తీసే పనులు

- Advertisement -

ఎమ్మెల్యే సహకారంతో మురికి కాలువ  పూడిక తీసే పనులు
ఎమ్మిగనూరు సెప్టెంబర్ 28

Sewage removal works with the cooperation of MLA

పట్టణం నందు 16 వార్డులో గత ఐదు సంవత్సరాలుగా శారదా కాన్వెంట్ ఫస్ట్ లైను ,సెకండ్ లైన్, గిప్సన్ కాలనీ మురికి కాలవల్లో పూడిక తీయకపోవడంతో, కాలువలో సుమారు రెండున్నర అడుగులు పుడిక చేరుకొని  కాలనీలో ఎక్కడికక్కడ డ్రైనేజీ నీరు నిలిచిపోయి, కాలువలు దుర్భరస్థితికి చేరుకున్నందున, ఎమ్మిగనూరు శాసనసభ్యులు బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి పరిస్థితిని వివరించగా, ఎమ్మెల్యే స్పందించి,  కాలువ అడుగు బాగాన నుండి పూడిక తీయుటకు ఆదేశించడం జరిగింది.16 వ వార్డు టీడీపీ  ఇంచార్జ్ దాదాసాహెబ్ పరిరక్షణలో మున్సిపాలిటీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది సహకారంతో గిప్సన్ కాలనీ ఫస్ట్ లైన్ మెయిన్ కాలువ నందు  అడుగుభాగం నుండి కూడిక తీయడం జరిగింది. ఎన్నో రోజుల నుండి తీయకపోవడంతో ఇబ్బందులకు గురైన వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ కామర్తి మహేష్, కార్యకర్తలు నర్సింలు ,రఘు, దాదాకలందర్ గంగన్న, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular