పెనుబల్లిలో చోరీ

- Advertisement -

పెనుబల్లిలో చోరీ

Theft in Penuballi

ఖమ్మం
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ హై స్కూల్ దగ్గర ఇంటిలో చోరీ జరిగింది.గోపాలకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో ఊరికి వెళ్ళాడు. ఇంట్లో ఎవ్వరూ లేరని సమయంలో దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు.
80 గ్రాములు బంగారం, లక్ష 30 వేల రూపాయల నగదును దోచుకు వెళ్లారు. ఊరి నుంచి తిరిగి వచ్చిన గోపాలకృష్ణారెడ్డి కి ఇంటి తాళం పగుల గొట్టి ఉండటం గమనించి. విఎం బంజర పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ చోరీ తెలిసిన వారి పనే అయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. చోరికి గురైన ఆరు  లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఒక లక్ష ముప్పై వేలు నగదును దుండగులు అపహరించుకు పోయినట్లు బాధితుడు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular