స్వాతంత్ర్య సమరయోధుల అడుగుజాడల్లో నడవాలి

- Advertisement -

 స్వాతంత్ర్య సమరయోధుల అడుగుజాడల్లో నడవాలి

ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి
తాడేపల్లిగూడెం, అక్టోబర్2,

Walk in the footsteps of freedom fighters

స్వాతంత్ర్య సమరయోధులను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు వారి అడుగుజాడల్లో నడవాలని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి సూచించారు. జాతిపిత మహాత్మాగాంధి, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను సంస్థ ప్రాంగణంలోని పరిపాలనా భవనం వద్ద బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధి డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలకులను ఎదిరించి, తెల్లదొరల వెన్నులో వణుకు పుట్టించిన మహనీయుల కృషి వెలకట్టలేనిదన్నారు. గౌతమ బుద్ధుడు చూపించిన అహింసా మార్గాన్ని గాంధీజీ ఆయుధంగా ఎంచుకున్నారని, అది ప్రపంచంలోని ఎన్నో స్వాతంత్ర్య ఉద్యమాలకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం యువత పాటుపడాలని చెప్పారు, స్వాతంత్ర్య సమరయోధుల బోధనలు, సిద్ధాంతాలపై ప్రతి విద్యార్థి అవగాహనను పెంచుకుని వారి ఆశయ సాధనకు కృషి చేయాలని వివరించారు. ముందుగా మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలతోపాటు నిట్ తూర్పు ముఖద్వారం వద్దనున్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ జీబి వీరేష్ కుమార్, అసోసియేట్ డీన్ లు డాక్టర్ కిరణ్ తీపర్తి, డాక్టర్ వి.సందీప్, ఆచార్యులు డాక్టర్ రాముడు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular