రాతన చెరువుకు చేరిన హంద్రీనీవా జలాలు

- Advertisement -

రాతన చెరువుకు చేరిన హంద్రీనీవా జలాలు

హర్షం వ్యక్తం చేసిన రైతులు,గ్రామ ప్రజలు

Handriniva waters reaching Ratana pond

తుగ్గలి
మండల పరిధిలోని గల రాతన చెరువుకు బుధవారం రోజున హంద్రీనీవా జలాలు చేరాయి.హంద్రీనీవా జలాలు రాతన చెరువుకు చేరడంతో రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మనోహర్ చౌదరి, కృష్ణమూర్తి చౌదరి మరియు గ్రామ టిడిపి కార్యకర్తలు ఆధ్వర్యంలో హంద్రీనీవా జలాలకు ప్రత్యేక పూజలను నిర్వహించారు.అనంతరం రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మనోహర్ చౌదరి మాట్లాడుతూ పత్తికొండ శాసనసభ్యులు కే.ఈ శ్యాంబాబు చొరవతో హంద్రీనీవా జలాలు తుగ్గలి మండలంలోకి అడుగుపెట్టాయని ఆయన తెలియజేశారు.రైతుల కష్టాల పట్ల చొరవ చూపి చెరువులకు నీరు వదిలినందుకు పత్తికొండ శాసనసభ్యులు కే.ఈ శ్యాంబాబుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.త్వరలోనే మండలంలోని గల చెరువులన్నీ జలకళను సంతరించుకుంటాయని ఆయన తెలియజేశారు.తెలుగుదేశం పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, రైతుల కష్టాలు కూడా తొలగిపోతాయని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివ,రాతన గ్రామ టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular