నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉంటా

- Advertisement -

సత్తెనపల్లి నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉంటా

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా

Will commit to the development of Sattenapalli constituency

సత్తెనపల్లి,
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో పాల్గొన్న ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించి, వాటిని పరిష్కరించి అండగా ఉంటానని పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు  భరోసా ఇచ్చారు. సత్తెనపల్లి రూరల్ మండలం పెద్దమక్కిన గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా
ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు అందించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు. నా దృష్టికి కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. అందరి సమస్యలు పరిష్కరిస్తామని, ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న కూటమి రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular