- Advertisement -
స్వచ్ఛతా మనకు లక్ష్యం
మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించిన నేతలు
అరకు టిడిపి ఇంచార్జ్ సివేరి దొన్ను దొర
అరకులోయ
Purity is our goal
స్వచ్ఛతా అరకు మన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్చార్జి సివేరి దొన్నుదొర అన్నారు. గాంధీ జయంతి స్వచ్ఛభారత్ ప్రారంభించి 10 ఏళ్ల పూర్తయిన సందర్భంగా పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాసు బాబు ఆధ్వర్యంలో స్వచ్ఛతా సేవా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. అరకు పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా నేతలు చీపురులు పట్టుకొని రహదారులను శుభ్రం చేశారు. సివేరి దొన్నుదొర మాట్లాడుతూ ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్న అరకును మరింత అందంగా తీర్చిదిద్దే బాధ్యతలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి 10ఏళ్లు అయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక విప్లవాత్మక మార్పులను ఈ మిషన్ తీసుకొచ్చిందన్నారు. అరకు సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అరకుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తున్న నేపథ్యంలో ఎవరికి వారే వ్యక్తిగతంగానూ, పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకునే ఆలోచన చేయాలని తెలిపారు. పశువులను సంరక్షించుకునే బాధ్యత యజమానులు తీసుకోవాలని రహదారులపై విచ్చలవిడిగా విడిచిపెట్టొద్దన్నారు. దీనివలన పంచాయతీగాని, ప్రభుత్వం గానీ సంకల్పించిన లక్ష్యాలు నెరవేర్చడంలో వైఫల్యం చెందుతున్నామన్నారు. పశువులను విచ్చలవిడిగా విడిచిపెట్టడం వలన రహదారులన్నీ కూడా అపరిశుభ్రంగాను, పచ్చదనం కోసం వేసిన మొక్కలన్నీ కూడా ఛిద్రమైపోతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ డస్ట్ బిన్ వాడాలని ప్లాస్టిక్ రహిత అరకు నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు.
గాంధీ జయంతి వేడుకలు
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అరకు పట్టణంలో ఆయన కాంస్య విగ్రహానికి తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్చార్జ్ సివేరి దొన్నుదొర పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతదేశ స్వతంత్రం కోసం అనుసరించిన పద్ధతులను గుర్తు చేసుకున్నారు. ఈ ప్రపంచానికి అహింస, శాంతి అనే రెండు ఆయుధాలను పరిచయం చేసి కొత్త శకానికి శ్రీకారం చుట్టిన మహానీయుడు మహాత్మా గాంధీ అని పేర్కొన్నారు. ఆయన అనుసరించిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని సూచించారు. పెదలబుడు మేజర్ పంచాయతీ సర్పంచ్ దాసుబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అరకువాలీ సర్కిల్ ఇన్స్పెక్టర్, టీడీపీ మండలఅధ్యక్షులు శెట్టి బాబురావు, ఎంపీటీసీలు దూరియా ఆనంద్, భీమరాజు, వార్డ్ సభ్యులు సునీత, త్రినాథ్, వైస్ సర్పంచ్ విజయ నిర్మల, పాడి చందు , సోమరాజు, లక్ష్మణ్, టీడీపీ మహిళ అధ్యక్షులు ద్రౌపతి, కళ, పద్మపురం మాజీ సర్పంచ్ మహాదేవ్, పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాలక రాజకుమార్, వెంకటరావు, జంపన్న, దిసరి అర్జున్, డోలియా అర్జున్ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.