అంబేద్కర్ ఫ్లెక్సీ తొలగించిన ఉండి ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

అంబేద్కర్ ఫ్లెక్సీ తొలగించిన ఉండి ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలి

Ambedkar Flexi has been removed and action should be taken against the MLA

మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్..

తాడేపల్లిగూడెం, అక్టోబర్ 3,
కాళ్ల మండలంలో ఏలూరుపాడు లో అంబేద్కర్ ఫ్లెక్సీ ని  అమర్యాదగా తొలగించిన  ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు పై  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలో మాల మహానాడు ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు.  ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ అంబేద్కర్ పై అనుచితంగా ప్రవర్తించిన రఘురామకృష్ణం రాజు పై  ఇటు ప్రభుత్వం గానీ, పోలీసులు గాని ఎలాంటి చర్యలు తీసుకుపోవడం దారుణమని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు శాసన సభ్యత్వం తొలగించి, ఫిర్యాదుల మేరకు పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని  నినాదాలు చేశారు. ఈ  కార్యక్రమంలో  జిల్లా కార్యదర్శి గారపాటి నానాజీ, నల్లి రాఖీ భాయ్, నాయకులు కర్ణి జోగయ్య , సరేళ్ళ శ్రీను,   తండా ఇసాక్ రాజు   నల్లి జయరాజు , మట్ట చంద్రశేఖర్ , సరేళ్ల  రఘు ,    మద్దాల రత్నంరాజు  , భూపతి సురెష్ తదితరులు   పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular