స్వచ్ఛ కాకినాడ అందరి లక్ష్యం కావాలి

- Advertisement -

స్వచ్ఛ కాకినాడ అందరి లక్ష్యం కావాలి

Clean Kakinada should be everyone's goal

పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలి..
– కాకినాడ సిటీ ఎమ్మెల్యే
పారిశుధ్య నిర్వహణకు సహకరించాలి..
కాకినాడను నంబర్ 1 స్థానంలో నిలపాలి
కమిషనర్ భావన
ముగిసిన స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు
కాకినాడ
పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలని, కాకినాడను స్వచ్ఛ నగరంగా ఉంచాలని, తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందజేసి పారిశుధ్య నిర్వహణకు సహకరించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు చేపట్టిన స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు బుధవారంతో ముగిశాయి. గాంధీ జయంతి సందర్భంగా ఆఖరి రోజైన బుధవారం కాకినాడ నగరంలో వివేకానంద పార్కు నుంచి మెక్లారిన్ హైస్కూల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని అన్ని సచివాలయాల సిబ్బంది, నగరపాలక సిబ్బంది, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, యానిమేటర్లు, సీఓలు ఇలా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా ఈ ర్యాలీని సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కమిషనర్ భావన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను డ్రోన్తో ఎగురవేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన ఆలోచన ప్రతి ఒక్కరి మదిలో ఉండాలని, పరిసరాల పరిశుభ్రతోనే ఆరోగ్యంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉంటే.. ఏ పనైనా చేయగలుగుతామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కాకినాడ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా ఉంచాలని కోరారు. గతంలో స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలతో ప్రజల్లో పారిశుధ్య నిర్వహణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ప్రస్తుతం మరొకసారి స్వచ్ఛతా హి సేవా పేరుతో అనేక కార్యక్రమాలు కమిషనర్ భావన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారన్నారు. కమిషనర్ భావన మాట్లాడుతూ.. ఈ స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలను గత నెల సెప్టెంబర్ 17న ప్రారంభించామని,
అక్టోబర్ ఒకటో తేదీ వరకు మొత్తం 360 ఈవెంట్లను పూర్తి చేశామన్నారు. గాంధీ జయంతి సందర్భంగా నేటితో ఈ కార్యక్రమం ముగుస్తుందన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular