- Advertisement -
శబరి మల పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని
MLA Thalasani started the Sabari Mala Padayatra
సికింద్రాబాద్
సికింద్రాబాద్ నుండి శబరిమలకు ప్రారంభమైన అయ్యప్ప స్వాముల పాదయాత్రకు జెండా ఊపి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 120మంది అయ్యప్ప స్వాములు 1230కిలోమీటర్ల దూరం పాదయాత్రతో వెళ్ళడం వారి భక్తి భావానికి నిదర్శనమని తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని చేపట్టిన స్వాములందరికి శుభాకాంక్షలు తెలిపారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో వారు వారి కుటుంబ సభ్యులు, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు.
- Advertisement -



