Monday, December 23, 2024

ఆస్తుల గొడవలు అందరి ఇళ్లలో ఉంటాయి

- Advertisement -

ఆస్తుల గొడవలు అందరి ఇళ్లలో ఉంటాయి

Property disputes happen in everyone's homes

విజయనగరం, అక్టోబరు 24, (వాయిస్ టుడే)
మీకు పాలన చేతగాక మా కుటుంబ విభేదాలు తెరపైకి తెస్తున్నారు. ఇది ప్రతి ఇంట్లో ఉండే తతంగమే. మా ఫ్యామిలీని చూపిస్తూ.. డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నారంటూ తాజాగా మాజీ సీఎం జగన్, తమ కుటుంబ విభేధాలపై స్పందించారు.విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలను వైఎస్‌ జగన్ పరామర్శించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. గుర్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. వైసీపీ హయాంలో గ్రామస్వరాజ్యం తీసుకొచ్చామని, కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయని జగన్ విమర్శించారు. అబద్దపుహామీలు గుప్పించి అధికారం చేపట్టిన కూటమి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సూపర్ సిక్స్ పథకాల మాటే మరచిపోయిందని, ప్రజల మదిలో పథకాల మాట వచ్చినప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందన్నారు.మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దగ్గరుండి మరీ, ఇక్కడి స్థితిగతులను తెలుసుకుంటూ ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నారన్నారు. గుర్లలో డయేరియా వ్యాధికి గురై, మృతి చెందిన ఘటనలు ఏనాడు జరగలేదని, ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్నారు. తాను మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు అందజేయడం జరుగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మృతుల సంఖ్య పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  రాష్ట్రంలో శాంతిభద్రతల స్థితిగతులు చూస్తే భయం వేస్తుందని, మహిళలకు భద్రత ఉందా అనే రీతిలో సందేహం కలుగుతుందన్నారు.ఇటీవల మాజీ సీఎం జగన్, ఆస్తులకు సంబంధించి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళపై కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై జగన్ స్పందిస్తూ.. ప్రతీ ఇంట్లో జరిగేదే తన ఇంట్లో జరిగిందని, కానీ ప్రతి సారి డైవర్షన్ పాలిటిక్స్ కి కూటమి పాల్పడుతుందన్నారు. అలాగే తన తల్లి, చెల్లి ఫోటోలను చూపిస్తూ టీడీపీ తెగ ఆనందం పడుతుందన్నారు. ముందు ప్రజా పరిపాలన సాగించండి.. అంతేగానీ ప్రక్క చూపులు మానండంటూ జగన్ హితవు పలికారు. ఎప్పుడూ మా కుటుంబంపై ఏడ్చే బదులు, రాష్ట్రంలోని అఘాయిత్యాలు, నేరాలు వీటిని అడ్డుకోండి అంటూ జగన్ అన్నారు.తాను ఎక్కడ పర్యటనకు వెళుతున్నా ప్రభుత్వం భయపెడుతోందని, 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సమయంలో రాష్ట్రంలో ఏ పథకం అమలు చేయని కూటమి, పక్కా ప్లాన్ తో తిరుమల లడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చిందన్నారు జగన్. ఇప్పుడు శాంతిభద్రతలు సన్నగిల్లిన సమయంలో, తన అనుకూల మీడియా ద్వారా తమ కుటుంబం గురించి పదే పదే టీవీలలో చూపిస్తూ, కూటమి నేతలు సంబరపడుతున్నట్లు తెలిపారు.ఇలా తొలిసారిగా తన కుటుంబ ఆస్తి వివాదానికి సంబంధించి జగన్ స్పందించగా,  హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. మహిళలంటే జగన్ కు ఏమేరకు గౌరవం ఉందో, తల్లి చెల్లిపై కోర్టు మెట్లెక్కినప్పుడే అర్థమవుతుందన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్