పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టండి.
Do better sanitation
కమిషనర్ ఎన్.మౌర్య
తిరుపతి నగరపాలక సంస్ధ
నగరంలో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులు ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని సీకాం కాలేజ్ సమీపం, లీలామహల్ జంక్షన్ లోని మస్టర్ గదుల వద్ద పారిశుద్ధ్య కార్మికుల హాజరు నమోదును శుక్రవారం తెల్లవారుజాము పరిశీలించారు. అనంతరం జీవకోన, సత్యనారాయణపురం కూడలి, అమెరికన్ బార్, చేపల మార్కెట్, పండ్ల వీధి, గాంధీ రోడ్డు తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను, గార్బేజ్ వలనరబుల్ పాయింట్స్ (జి.వి.పి.)ను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్.మౌర్య మాట్లాడుతూ సిబ్బంది అందరూ విధులకు హాజరయ్యేలా చూడాలని, అలా రాని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలోని ప్రధాన వీధుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అన్నారు. అలాగే గార్బేజ్ వలనరబుల్ పాయింట్స్ (జి.వి.పి.) వద్ద చెత్త ను వాహనాలతో తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. ఇంటింటి వద్ద చెత్త సేకరణ ఒక క్రమ పద్ధతి నిర్దిష్ట సమయంలో జరిగేలా చూడాలని అన్నారు. నైట్ స్విపింగ్ కూడా రెగ్యులర్ గా చేయాలని, నగరంలో ఎక్కడా చెత్త కనపడకుండా సిబ్బంది పనిచేయాలని అన్నారు. అలాగే రోడ్లలో ఉన్న గుంతలను వెంటనే పూడ్చేలా తగు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ. మధుకుమార్, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు..*