వృద్ధులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్ల ఫోన్ కాల్స్
Phone calls by cyber criminals targeting the elderly
మోసపోతున్న వారు విశ్రాంత ఉద్యోగులే ఎక్కువ
సీనియర్ సిటిజన్ లను అప్రమత్తం చేసేందుకు ఈ అవగాహన కార్యక్రమం
గోదావరిఖని
సీనియర్ సిటిజన్స్ వయసులో ఉన్నప్పుడు క్షణం తిరికలేకుండా గడిపిన ఉద్యోగులు, వ్యాపారులు. వీరిలో అత్యధికులు ఒంటరిగా ఉంటున్నారు. మాట కలిపేవారి కోసం ఆశగా ఎదురు చూస్తూ కాలక్షేపానికి సోషల్ మీడియాను ఆశ్రయిస్తుంటారు. ఈ బలహీనతనే సైబర్ నేరగాళ్ళు అవకాశంగా చేసుకొని ఫోన్లు చేస్తూ ప్రేమగా పలకరిస్తూ తరువాత సైబర్ నేరాలకు పాల్పడుతూ భయపెడుతున్నారు. కొద్ది నెలలుగా నమోదవుతున్న సైబర్ నేరాలను పరిశీలిస్తే బాధితుల్లో వృద్ధులే ఎక్కువగా ఉంటున్నారు. దాంతో వారిని చైతన్యపరచాలని ఉద్దేశ్యం తో సైబర్ జాగృకత దివాస్ కార్యక్రమం లో భాగంగా డిజి షికా గోయల్ మేడమ్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో బుధవారం నాడు ఏన్టీపీసీ లోని మిలీనియం హల్ లో సైబర్ నేరాలపై అవగాహనా కల్పించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి ముఖ్య అతిథులు హాజరై సీనియర్ సిటిజన్ లను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ….ఇంటర్నెట్ ద్వారా జరుగుతున్న మోసాలపై అవగాహనా ఉండదని, సీనియర్ సిటిజన్ల పదవీ విరమణతో వచ్చిన గ్రాట్యూటీ. ఇతర సేవింగ్స్ కారణంగా వీరి ఖాతాల్లో పెద్దమొత్తంలో డబ్బుండే అవకాశముంది. ఉన్నతాధికారులైతే పించను కూడా భారీగానే ఉంటుంది. పైగా వీరి పిల్లలు చాలావరకు విదేశాల్లో ఉంటారు. ఇంకొందరు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతుంటారు. బ్యాంకు ఖాతాలో చాలా పొదుపులు ఉంటాయని, సీనియర్ సిటిజన్‌లకు సాంకేతిక పరిజ్ఞానం గురించి తక్కువ జ్ఞానం ఉంటుంది కనుక వారిని మోసం చేయడం సులభం అని సైబర్ క్రిమినల్స్ ముఖ్యంగా సిటిజన్స్‌ను టార్గెట్ చేస్తున్నారు అన్నారు. స్టాక్ మార్కెట్, హోంలోన్స్, ఇన్సూరెన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ పేర్లతో మాయమాటలు చెప్పి మోసలకు పాల్పడుతున్నారని తెలిపారు. తాము పంపించే వీడియో లింకులకు లైక్ కొడితే చాలు ఊహించనంత డబ్బు వస్తుంది అని, అమ్మాయిలతో వీడియో కాల్ చేయించి అవతలి వ్యక్తి దాన్ని రిసీవ్ చేసుకోగానే రికార్డు చేసి బెదిరించి డబ్బులు అడగడం డబ్బు ఇవ్వపోతే వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బెదిరింపులకు పాల్పడడం దాంతో భయపడి చాలామంది డబ్బులు ఇస్తూనారు అన్నారు.
ప్రస్తుత నేరాల తీరు పై అవగాహన పెంచుకోవాలి. తెలియని సంబర్ల నుంచి పోన్ కాల్స్ వస్తే సమాచారం ఇవ్వొద్దు. ముఖ్యంగా వాట్సప్ వీడియో కాల్స్ కు అప్రమత్తంగా ఉండాలి. అత్యధిక లాభాలు వస్తాయనగానే అశపడొద్దు డిజిటల్ అరెస్టులకు భయపడొద్దు. ఒకవేళ మోసపోతే వెంటనే 1930 నంబరుకి ఫోన్ చేయాలి సీపీ సూచించారు.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, సీనియర్ సిటిజన్ పిటి స్వామి, విశ్రాంత ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.