సర్వే కు ప్రజలు సహారరించాలి
People should support the survey
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 06
సర్వే సిబ్బందికి సహకరించాలని,
తప్పుడు సమాచారం ఇవ్వొద్దని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం గణపురం మండలం 3వ వార్డు, భూపాలపల్లి మండలం కృష్ణ కాలనిలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా హౌస్ లిస్టింగ్ సర్వే ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏ ఒక్క కుటుంబాన్ని వదల కుండా వివరాలు సేకరణ చేయాలని సూచించారు. కుటుంబ వివరాలు చెబితే ఏదో జరుగుతుందనే అపోహ వద్దని వివరాలు గోప్యతగా ఉంచుతామని అన్నారు. బుధ గురువారాల్లో రెండు రోజుల పాటు గ్రామ పంచాయతి, మున్సిపాలిటీలో సమగ్ర ఇంటింటి కుటుంబ జాభితా సర్వే చేయనున్నట్లు తెలిపారు. సర్వే నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, ఒక్క ఇంటిని కూడా వదల కుండా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, మండల, నియోజకవర్గ ప్రత్యేక
అధికారులను నియమించామని స్పష్టం చేశారు. 6వ తేది 7 వరకు హౌస్ లిస్టింగ్ సర్వే చేస్తామని, తదుపరి 8వ తేదీ నుండి చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. పకడ్బందీగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని, ఇందుకు సంబంధించి ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లు, మండల ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులను, జిల్లా నోడల్ అధికారిని నియమించినట్లు తెలిపారు.
8వతేదీ నుంచి సమగ్ర సర్వే మొదలవుతుందని, ఈ రెండు రోజులు ఎన్యుమరేటర్లు ఇంటింటికి స్టిక్కర్ అంటించే కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. 8 నుంచి సమగ్ర ఇంటింటి సర్వే కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. ఈ సర్వేలో ప్రతి కుటుంబం బుక్ లెట్ లో పొందుపరిచిన కుటుంబ వివరాలను నమోదు చేస్తారని అన్నారు. ప్రజలు సర్వే సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఫారంలో అడిగిన అంశాల ఆధారంగా అన్ని అంశాలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని, సమాచారంలో తప్పులు లేకుండా ఇవ్వాలన్నారు. పూర్తిస్థాయి సమాచారం సర్వేలో ఉంటే ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 12 మండలాలు, భూపాలపల్లి మున్సిపాలిటీ కలిపి మొత్తం 1,31,030 ఇండ్లు ఉన్నాయని, వీటి సర్వే నిమిత్తం 993 ఎన్యూమరేషన్ బ్లాకులుగా విభజించి 934 మంది ఎన్యూమరేటర్లు, 101 మంది సూపర్ వైజర్లను నియమించామని తెలిపారు. గణన ప్రక్రియకు నియమించిన మండల, నియోజకవర్గ, జిల్లా ప్రత్యేక అధికారులకు, సూపర్ వైజర్లుకు, ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్ వాడి, విఓఎస్ సిబ్బంది సర్వే ప్రక్రియకు వినియోగిస్తున్నామని తెలిపారు. సర్వే వివరాలను ఏరోజు కారోజు డేటా ఎంట్రీ చేసేందుకు జరుగుతుందని, ఇందుకు సంబంధించి డేటా ఎంట్రీ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండలాల్లో, నియోజకవర్గాల్లో సర్వే పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించామని, క్షేత్రస్థాయిలో సర్వే తీరు పరిశీలిస్తారని, ఏదేని సమస్య వస్తే జిల్లా అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ సర్వేలో ఎలాంటి లోటుపాట్లు, ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత, విద్యావివరాలు, ఉద్యోగ, ఉపాధి, భూములు, రిజర్వేషన్లతో పొందిన ప్రయోజనాలు, వలస వెళ్లినవారి వివరాలు సేకరణ జరుగుతుందని తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉపాధి, కుల అంశాలను ప్రధానంగా ఈ సర్వేలో గుర్తిం
చడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా సర్వేలో ఎలాంటి అపోహలకు గురికావద్దని ప్రజలకు సూచించారు. సర్వే అంతా గోప్యంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డిఓ, నియోజకవర్గ నోడల్ అధికారి, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, శ్రీనివాస్, ఎంపీడిఓ భాస్కర్, సూపర్ వైజర్ ఉష, ఎన్యూమరేటర్ సుభాశ్ తదితరులు పాల్గొన్నారు.