గద్దవాలిన గౌతమ మహాముని పుణ్యక్షేత్రం రోడ్డుకు మరమ్మత్తులు
Repairs to Gaddawalina Gautama Mahamuni Shrine Road
భక్తుల సౌకర్యార్థం రోడ్డుకు మరమ్మత్తులు.
గ్రావెల్ తో గుంతలు పూడ్చివేత.
గ్రామ సర్పంచ్ చౌడప్ప, సర్పంచ్ గౌరవ సలహాదారులు ప్రతాప్ యాదవ్.
తుగ్గలి
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని తుగ్గలి మండలం పరిధిలోని బొందిమడుగుల గ్రామ మజార పంచాయతీ లింగనేని దొడ్డి గ్రామంలో స్థానిక గద్వాల కొండలో కొలువైన శ్రీ గౌతమ మహాముని తిమ్మగురుడు స్వాముల వారి దేవాలయం నుంచి లింగనేనిదొడ్డి గ్రామం వరకు సుమారు మూడు కిలోమీటర్ల దూరం వరకు ఉన్న రోడ్డుకు పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సర్పంచ్ చౌడప్ప ఆద్వర్యంలో గ్రామ సర్పంచ్ గౌరవ సలహాదారులు సలీంద్ర ప్రతాప్ యాదవ్ రోడ్డు మరమ్మతు పనులు నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ సలహా దారులు ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ డిశంబర్ నెల రెండో వారంలో మొదలవుతున్న గద్వాల కొండలో కొలువైన శ్రీ గౌతమ మహాముని తిమ్మగురుడు స్వాముల వారి ఆరాధనోత్సవాలు 13వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు ఉన్నందున ఆరాధనోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం వారికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు పత్తికొండ ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు లింగనేనిదొడ్డి గ్రామం నుంచి గౌతమ ముని కొండ వరకు దాదాపు మూడు కిలోమీటర్ల వరకు ట్రాక్టర్లతో మట్టిని తరలించి రోడ్డుకు మరమ్మతులు చేయించడం జరిగిందని గ్రామ సర్పంచ్ సలహా దారులు ప్రతాప్ యాదవ్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బొందిమడుగుల మజారా పంచాయతీ ఉప సర్పంచ్ కౌలుట్లమ్మ, గ్రామ గ్రామ మాజీ ఉప సర్పంచ్ చిన్న పులికొండ,వడ్డే సుంకన్న,ఎంపీపీ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ వెంకటేష్,గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ రామారావు,వడ్డే వీరేంద్ర,వడ్డే వెంకటేష్,రంగ నాయకులు మరియు గ్రామ ప్రజలు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.