Thursday, December 5, 2024

లాభాల ట్రాక్ లో ఆయిల్ పామ్ తోటలు..!

- Advertisement -

లాభాల ట్రాక్ లో ఆయిల్ పామ్ తోటలు..!

Oil palm plantations on the track of profits..!

రూ. 20413 చేరిన టన్ను గెల ధర

ఒక ఏడాదిలోనే రూ 7000, పెరిగిన ధర.
ఏడాదికి ఎకరానికి ఒక లక్ష రూపాయలు గ్యారంటీ ఆదాయం

ఎకరం సాగుకు రూ 50000, వరకు రాయితీ ఇస్తున్న ప్రభుత్వం.

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కన్నా ఆయిల్ పామ్ రైతే ధైర్యంగా ఉండొచ్చు

మంత్రి తుమ్మల

హైదరాబాద్

రాష్ట్రము లో ఆయిల్ పామ్ సాగు రైతులకు బంగారు పంటగా మారింది ధర పెరగడంతో పాటు ప్రభుత్వం నుండి సబ్సిడీలు అందుతుండడం తో ఆయిల్ పామ్ సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఒకసారి దిగుబడి ప్రారంభం అయితే క్రమం తప్పకుండా ఆదాయం వస్తుండడం, కూలీలు మరియు కోతుల సమస్య లేకపోవడంతో క్రమం గా  ఆయిల్ పామ్ సాగు పెరుగుతుంది.
దేశం లో వంటలో ఉపయోగించే నూనె లో దాదాపు 40శాతం పామ్ ఆయిల్ ఉంటుంది. ఇంతగా డిమాండ్ ఉన్నప్పటికి మన దేశం లో పామ్ ఆయిల్ సాగు బాగా తక్కువ ఉండడం మరియు మలేషియా, ఇండోనేషియా నుండి  మనం దిగుమతి చేసుకుంటున్నాము. ప్రపంచంలో అత్యధిక దిగుబడి ని ఇచ్చే నూనె గింజల పంటలో ఆయిల్ పామ్ పంట ఒకటి. భారత దేశం ముడి చమరు  పెట్రోల్, డీజిల్ తర్వాత ఎక్కువగా పామ్ ఆయిల్ ఆయిల్ పామ్ చెట్ల నుండి వచ్చిన గెలల తో తీసిన ఆయిల్, ని దిగుమతి చేసుకుంటుంది. వంట నూనె లో దీని వాటా 70% వరకు ఉంటుంది. గత 100 సంవత్సరాలు నుండి భారత దేశం వంట నూనె డిమాండ్ లో 80% వరకు దిగుమతి చేసుకుంటూనే ఉంది. ఇంత డిమాండ్ ఉన్న పంట కాబట్టే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బంగారు పంట మీద ఎక్కువగా శ్రద్ధ చూపించి రైతులకి తోడ్పాటు గా మొక్కలు మరియు డ్రిప్ మీద సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి తోడుగా రైతులకి ఎరువులు మరియు అంతర పంటకి పెట్టుబడి సాయం క్రింద ఒక ఎకరానికి 4200 రూపాయిలు మొదటి 4 సవంత్సరాలు ఇవ్వడం జరుగతుంది.
వ్యవసాయ శాఖ మంత్రి   ప్రత్యేక చొరవతో విదేశాల నుండి దిగుమతి అయ్యే పామ్ ఆయిల్ మీద 20 శాతం సుంకం విధిస్తూ కేంద్రం ఇటీవలే నిర్ణయం తీసుకుంది మరియు ఆయిల్ పామ్ ధర నిర్ణయం లో తీసుకునే ఆయిల్ ఎక్ష్ ట్రాక్షన్ రేట్ ఓ ఈ ఆర్ ను -25 సంవత్సరానికి 19.42 శాతం గా  ప్రభుత్వం నిర్ణయించింది గత సంవంత్సరం లో 2023-24 ఓ ఈ ఆర్ 19.32 కాగా, దీని వలన కూడా మన రైతులకి ఆయిల్ పామ్ గెలలు సుమారు గా  రూ. 160-180 వరకు పెరిగే అవకాశం ఉంది
వ్యవసాయ శాఖ మంత్రి  మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తో గడిచిన ఆరు నెలలోనే రూ 7000 వరకు రేట్ పెరిగి టన్ను ధర రూ.20413 రైతులకు ఇవ్వడం జరుగుతుంది
రాజన్న సిరిసిల్ల  జిల్లా లో ఆయిల్ పామ్ తోటలు నాటడం  లో 2022-23 నుంచి ప్రారంభం అయింది.  ఇప్పటి వరకు 2100 ఎకరాలలో 700 మంది రైతులు ఈ పంటని సాగు చేస్తున్నారు. వచ్చే సంవంత్సరం 2025-26 ఆగష్టు నుండి మొదటి కోత ప్రారంభం అవుతుంది. కోసిన పంటని దగ్గరలో ఉన్న కొనుగోలు  కేంద్రాల ద్వారా మార్కెటింగ్ జరుగుతుంది. ప్రతి నెల ధర ప్రభుత్వం చే నిర్ణయించబడుతుంది.
ఆయిల్ పామ్ సాగు మొదలు పెట్టిన 4వ సంవత్సరం నుండి దిగుబడి వస్తుంది. 4-6 వ సంవత్సరం వరకు 5నుండి 7 టన్నులు దిగుబడి వస్తుంది . 7వ సంవత్సరం నుండి 10-15 టన్నులు దిగుబడి వస్తుంది. ప్రి-యునిక్ కంపెనీ వారు పంట గెలలు కొనుగోలు చేస్తారు.పంట కొనుగోలు చేసిన వారం రోజుల లో రైతు బ్యాంకు ఖాతా కు డబ్బు జమ అవుతోంది.ఖచ్చితమైన మార్కెటింగ్ వున్న పంట, దళారి లు వుండరు. కావున రైతులు ఆయిల్‌పామ్ పంట సాగు పై దృష్టి సారించి ఆర్ధికంగా అభివృద్ది పొందాలి.
ఆసక్తి ఉన్న రైతులు మీ ఉద్యాన అధికారి గారిని, వ్యవసాయ విస్తీర్ణ అధికారి లేదా ఆయిల్ పామ్ కంపెనీ సిబ్బంది ని సంప్రదించగలరు.
ఉద్యాన అధికారుల వివరాలు
వి. గోవర్ధన్ , ఉద్యాన అధికారి  సిరిసిల్ల డివిజన్, 8977714049.
సి హెచ్. లోకేష్, ఉద్యాన అధికారి వేములవాడ డివిజన్, 8977714048.
కె. ఆర్. లత జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి రాజన్న సిరిసిల్ల జిల్లా

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్