సర్వీస్ రోడ్డు కోసం ధర్నాకు దిగిన గ్రామస్తులు

- Advertisement -

సర్వీస్ రోడ్డు కోసం ధర్నాకు దిగిన గ్రామస్తులు

Villagers protesting for service road

నిర్మల్
నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామస్తులు మా సర్వీస్ రోడ్డు మాకు కావాలంటూగ్రామస్థులు  ఎన్ హెచ్ 44 జాతీయ రహదారిపై రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఈ సందర్భంగా ఎన్ హెచ్ పి డి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ జాతీయ రహదారి మరమ్మత్తులో భాగంగానే సర్వీస్ రోడ్డుపై నుండి వాహనాలు వెళ్తాయని ఎన్ హెచ్ పి డి తమకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. పనులు పూర్తయిన తమ గ్రామంలో నుండే వాహనాలు వెళ్తుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. గ్రామంలోని రోడ్డుపై ప్రభుత్వ పాఠశాల, దేవాలయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ రోడ్డుపై నుండే వాహనాలు వెళుతుండడంతో ప్రజలు, పశువులు ప్రమాదాల బారిన దాఖలాలు ఎన్నో ఉన్నాయన్నారు. పనులు పూర్తయిన జాతీయ రహదారి పై నుండే వాహనాలు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. తమ సమస్య పూర్తయ్య వరకు ఆందోళన విరమించేది లేదని తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వినిపించుకోకుండా ఆందోళన కొనసాగించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular