Tuesday, March 10, 2026

అమిత్ షా పై ఎస్సీ ,ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

- Advertisement -

అమిత్ షా పై ఎస్సీ ,ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

SC, ST, Atrocity case should be registered against Amit Shah

కేంద్ర హోం శాఖ మంత్రి నుండి తొలగించాలి

కోరుట్లలో అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం

కోరుట్ల
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని, వెంటనే ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని మాల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు ఘన నివాళులర్పించారు. అనంతరం  జాతీయ రహదారిపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పైన పార్లమెంటులో అవగాహన లేని మనువాదుల మాటలు మాట్లాడిన అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం కోరుట్ల పోలీస్ స్టేషన్లో అమిత్ షా పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అహంకారపూరిత మాటలను పార్లమెంటులో అమిత్ షా మాట్లాడారని ఆరోపించారు. అంబేద్కర్ ..అంబేద్కర్… అంటూ ఆయన పేరు తీయడం ఓ పేషన్ అయిపోయిందని అదేవిధంగా దేవుని పేరు తెలిస్తే పుణ్యం వస్తుందని అని మనువాదు మాటలు మాట్లాడడం సరికాదన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని ఉద్దేశంతో ఉందని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే పదవులను అన్ని రాజకీయ పార్టీల నాయకులు అనుభవిస్తున్నారన్నారు. అంబేద్కర్ను అవమానపరిచే విధంగా మాట్లాడిన అమిత్ షా పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆయనను కేంద్ర హోం శాఖ మంత్రి పదవి నుండి తప్పించి దేశ దళిత సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర నాయకులు బలిజ రాజారెడ్డి, రాస భూమయ్య, బద్ది మురళీధర్ ,దుంపల రాజనర్సయ్య, డివిజన్ అధ్యక్షుడు ఉయ్యాల శోభన్, భూపెల్లి నగేష్ , గురువంతులు నారాయణ ,మాల సంఘ పట్టణ అధ్యక్షుడు పొట్ట లక్ష్మణ్, సామ ల వేణుగోపాల్, గంగారెడ్డి, రాజశేఖర్, శంకర్  రాజేందర్, మురళి, శేఖర్, సురేష్, లింగం, రామిండ్ల రాంబాబు ,మండలంలోని వివిధ గ్రామాల సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్