వేములవాడలో కోనోకార్పస్ చెట్లను తొలగించాలి

- Advertisement -

వేములవాడలో కోనోకార్పస్ చెట్లను తొలగించాలి

Conocarpus trees should be removed in Vemulawada

-సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు

వేములవాడ
వేములవాడలో కోనోకార్పస్ చెట్లను తొలగించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు డిమాండ్ చేశారు.వేములవాడ ఫస్ట్ బైపాస్ రోడ్ లో కోనోకార్పస్ చెట్లు ఏపుగా పెరిగి ప్రజా ఆరోగ్యానికి ఇబ్బందికరంగా

ఉన్నాయని,గతంలోనే వేములవాడ మున్సిపల్ కమిషనర్  లెటర్ ఇవ్వడం జరిగిందని కానీ తొలగించలేదని ఈ సందర్బంగా గుర్తుచేశారు.ఇదే విషయమై వేములవాడ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా

విజ్ఞాపన చేయడం జరిగిందని తెలిపారు.ప్రపంచ వ్యాప్తంగా హానికరమైన చెట్లని డబ్ల్యూహెచ్వో సైతం ఈ చెట్లను నిషేధించింది అని,కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వం వీటిని హరితహారంలో భాగంగా పెట్టి ప్రజల ప్రాణాలతో

చెలగాటం ఆడారని అన్నారు.ఈ సమావేశంలో సీపీఐ నాయకులు ఆకుల.ఆంజనేయులు,బొడిగె మల్లవ్వ,వావిలాల లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular