- Advertisement -
అనురాగ్ యూనివర్సిటీ బస్సుల వల్ల భారీగా ట్రాఫిక్ జామ్
Heavy traffic jam due to Anurag University buses
మేడ్చల్
మేడ్చల్ జిల్లా నారపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోడిమెట్ల వద్ద నారాపల్లి ఎంజీఆర్ థియేటర్ నుంచి జోడిమెట్ల మెగా కంపెనీ యూటర్న్ వరకు భారీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. సోమవారం ఉదయం నుండి సుమారు 50 , 60 అనురాగ్ యూనివర్సిటీ బస్సుల వల్ల భారీ ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ప్రతిరోజు అన్నోజిగూడ ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ చేసుకొని జోడిమెట్ల వైపు వెళ్లి అనురాగ్ యూనివర్సిటీ బస్సులు ఈరోజు జోడిమెట్ల నుంచి యూటర్న్ చేయడం వల్ల వరంగల్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలు, అలాగే ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అక్కడే ఉన్న ట్రాఫిక్ ఎస్సై యూనివర్సిటీ బస్ డ్రైవర్లను మందలించి అన్నోజిగూడ ఫ్లైఓవర్ వైపు వెళ్లాలని చెప్పాల్సిన ఎస్ఐ దగ్గరుండి ట్రాఫిక్ ని ఆపి మరియు యూనివర్సిటీ బస్సులను పంపించడం జరుగుతుంది. సుమారుగా గంట నుంచి ఇలాగే ట్రాఫిక్ జామవుతుందని స్థానికులు ఆరోపించారు. భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో స్కూల్ బస్సులు, ఇతర కాలేజీ బస్సులు, ఆర్టీసీ బస్సులు వాహనాలు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యాయని స్థానికులు ప్రజలు , వాహనదారులు ఆగ్రహం చెందారు
- Advertisement -