- Advertisement -
గవర్నర్ కు స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ
Collector who welcomed the Governor, SPసిద్దిపేట
రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కు జిల్లా కలెక్టర్ మను చౌదరి.. ఇంచార్జ్ సీపీ అకిల్ మహాజన్ లు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ అనంతరం ఐడీఓసీ మొదటి అంతస్తులోని స్టేట్ ఛాంబర్ లో తేనేటి విందును స్వీకరించి కలెక్టర్, సీపీ లతో ముచ్చటించారు. అనంతరం ఐడిఓసి నుండి సిడిపేట రూరల్ యంపీడిఒ కార్యాలయ సమీపంలో నిర్వహిస్తున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి, 43వ రాష్ట్ర మహాసభ కార్యస్థలికి బయలు దేరారు. ఈ సందర్భంగా సిరిసిల్ల ఎస్పీ.. ఇన్చార్జి సిపి అఖిల్ మహాజన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ వర్మ పర్యటన సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
- Advertisement -




