- Advertisement -
లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలి
Lokesh should be Deputy Chief Minister
పిఠాపురం
నారా లోకేశ్ ఉపముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశంపార్టీలోని కోటిమంది కార్యకర్తలూ కోరుకుంటున్నారని,పార్టీకి కరుడుగట్టిన సైనికుడునైన తానూ అందులో ఉన్నానని,అవసాన స్థితికి చేరుకున్న పార్టీకి తన పాదయాత్రతో పునరుజ్జీవమిచ్చి,కార్యకర్తల్లో ధైర్యం నింపి,పార్టీకి వెన్నెముకగా నిలిచిన నారా లోకేశును ఉపముఖ్యమంత్రి చేయాలని తామంతా అనుకోవడంలో తప్పేంటని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వీ.ఎస్.ఎన్.వర్మ అన్నారు.కార్యకర్తల మనోభావాలను అధిష్టానం గౌరవించాల్సిందేనంటూ స్పష్టం చేశారు.
పిఠాపురం పట్టణంలోని తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.,పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేశ్ పార్టీకి కోటి సభ్యత్వాలు చేసి పార్టీని ప్రపంచంలోనే ఏకైక పార్టీగా నిలిపినందుకు పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు..
- Advertisement -