- Advertisement -
పదవ తరగతి విద్యార్ది ఇంటికి వెళ్లిన కలెక్టర్
A collector who went to the home of a tenth standard studentయాదాద్రి
యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు వేకప్ కాల్ చేసి విద్యార్థి ఇంటి డోర్ కొట్టి విద్యార్థిని నిద్రలేపారు. భరత్ చంద్ర చారి అంటూ విద్యార్థిని పిలుచుకుంటూ విద్యార్థి ఇంటికి వెళ్లారు కలెక్టర్. విద్యార్థికి నా సొంత ఖర్చులతో పదవ తరగతి ఎగ్జామ్స్ వరకు ప్రతి నెల 5000=00 రూపాయలు చొప్పున ఇస్తా అని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి నెలకు గారు ఐదు వేలరూపాయలు ఇచ్చారు. విద్యార్థికి చదవడానికి ఒక చైర్ మరియు రైటింగ్ పాడ్ ఇచ్చారు. నేను జిల్లా కలెక్టర్ ని వచ్చాను. ఎలా చదువుతున్నారు అంటూ విద్యార్థితో మాట్లాడారు. పదవ తరగతి అనేది విద్యార్థికి మైలు రాయి లాంటిది. మీ అమ్మ నిన్ను ఇంత కష్టపడి చదివిస్తునందుకు నువ్వు పదవ తరగతిలో మంచి మార్క్స్ సాధించి మీ అమ్మ కి సంతోషాన్ని ఇవ్వాలని సూచించారు. పదవ తరగతిలో కష్టపడి చదివి పాస్ అయితే జీవితంలో విజయానికి తొలి మెట్టు అవుతుంది. కష్టపడి చదివి తల్లితండ్రులకు , గురువులకు, మరియు జిల్లా కి మంచి పేరు తీసుకరావాలని సూచించారు.
- Advertisement -




