హోంగార్డులను స్వరాష్ట్రాలకు బదిలీ చేయాలి

- Advertisement -

హోంగార్డులను స్వరాష్ట్రాలకు బదిలీ చేయాలి

Home Guards should be transferred to Swarashts

-సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈశ్వరయ్య

-సీఎస్‌, సీఎం, హోంమంత్రికి లేఖ

అమరావతి:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నియమించిన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల స్థానికత కలిగిన హోంగార్డులను స్వరాష్ట్రాలకు బదిలీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)కు గురువారం ఆయన ఒక లేఖ రాశారు. వాటి ప్రతులను  సీఎం నారా చంద్రబాబుకు, హోంమంత్రి వంగలపూడి అనితకు పంపారు. 15 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నియమితులైన దాదాపు 400 మంది హోంగార్డులు చాలీచాలని రోజు వారి వేతనాలతోను, కుటుంబాలకు దూరంగా ఉంటూ తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వారంతా ఆంధ్రప్రదేశ్‌ స్థానికతను కలిగి ఉన్నారని, ఇంటర్మీడియట్‌ వరకు వారి చదువు ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగిందని, దీంతో వారు తెలంగాణలో నాన్‌ లోకల్‌గా పరిగణించబడుతున్నారని పేర్కొన్నారు. ఈ కారణాలతో తెలంగాణలోని కానిస్టేబుల్‌ ఎంపికలో హోంగార్డులకు ఇచ్చే వెసులుబాటును కోల్పోతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ కానిస్టేబుల్‌ ఎంపికలో దరఖాస్తు చేసుకోగా, వారి సర్వీసు తెలంగాణలో ఉండటంతో..వారికి ఆంధ్రప్రదేశ్‌ కోటా వర్తించబోదని చెబుతున్నారని, ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హోంగార్డులు నష్టపోతున్నారన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చే రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు తదితర అన్ని సంక్షేమ పథకాలనూ కోల్పోవడంతోపాటు, వారి పిల్లల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. తెలంగాణలో పనిచేస్తున్న హోంగార్డుల మనోవేదన్ని అర్థం చేసుకుని వారిని ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయాలని కోరారు. అలాగే తెలంగాణ రాష్ట్రం స్థానికత కలిగి..ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 400 మంది హోంగార్డులు పనిచేస్తున్నారన్నారు. దీంతో తెలంగాణ స్థానికత కలిగిన 400 మంది హోంగార్డులను తెలంగాణకు బదిలీచేసి, ఆంధ్రప్రదేశ్‌ స్థానికత కలిగిన 400 మంది హోంగార్డులను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయడం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి బడ్జెట్‌ భారం ఉండబోదని ఆయన తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల స్థానికత కలిగిన హోంగార్డులను వారి స్వరాష్ట్రాలకు బదిలీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో ఈశ్వరయ్య విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular