- Advertisement -
పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులతో సమీక్ష
Bhatti Vikramarka and Uttam Kumar Reddy visited the Pulichintala project.
సూర్యాపేట (వాయిస్ టుడే): సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టు పరిస్థితి, నీటి నిల్వలు, ప్రస్తుత పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ, జెన్‌కో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




