సీసీ కెమెరాల ఏర్పాటుతో దొంగతనాల నుంచి రక్షణ–పెద్దపల్లి ఏసిపి కృష్ణ

- Advertisement -

సీసీ కెమెరాల ఏర్పాటుతో దొంగతనాల నుంచి రక్షణ–పెద్దపల్లి ఏసిపి కృష్ణ

Protection from thefts with the installation of CC cameras--Peddapally ACP Krishna

 పెద్దపల్లి ప్రతినిధి:
జిల్లా కేంద్రంలోని రంగంపల్లి వద్దగల జిల్లా కోర్టు పక్క గల్లీలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 6 సీసీ కెమెరాలను పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎసిపి  గజ్జి కృష్ణ,  సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి వద్ద 6 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన కాలనీ ప్రజలకు వారు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు అవగాహన కల్పించి, ఇతర ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత పట్టణంలో దొంగతనాలు విపరీతంగా పెరిగాయని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల దొంగతనాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నారు. ఇన్స్టాల్ చేసిన సీసీ కెమెరాలను, పనిచేసే విధంగా మెయింటెనెన్స్ చేయాలని, సీసీ కెమెరాలను మొబైల్ కు కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మల్లేష్, కాలనీ ప్రజలు  పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular